కోలీవుడ్ హాట్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తమిళ సినిమాలతో బాగా బిజీగా ఉన్న త్రిష ఇకపోతే చాలా కాలం తర్వాత టాలీవుడ్ సీనియర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే ఏడాది  సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా రూపొందుతున్న విడ మయార్చి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.తమిళ టాప్ హీరో అజిత్ సినిమా కాబట్టి ఈ సినిమా పై కూడా తమిళ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లతో పాటు ఈ హాట్ బ్యూటీ లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న థగ్ లైఫ్ మూవీ లో కూడా హీరోయిన్ గా కనిపించబోతుంది.


మూవీ కి సీనియర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా అలాగే మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ రామ్ లో కూడా ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే యువ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఐడెంటిటీ మూవీ లో కూడా త్రిష హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ లతో పాటు సోనీ లివ్  ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోయే బ్రింద అనే వెబ్ సిరీస్ లో కూడా త్రిష ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇలా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయి.హిందీలో కూడా సల్మాన్ సినిమాలో నటిస్తుంది.ఇలా వరుస సినిమాలు చేస్తున్న త్రిషకి ఒక సూపర్ రికార్డ్ ఉంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఒకే సమయంలో నటిస్తూ బిజీఎస్ట్ యాక్ట్రెస్ గా రికార్డ్ కొట్టింది. స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోయిన త్రిష.. ఒకానొక సమయంలో కుర్ర హీరోయిన్ల పోటీ తట్టుకోలేక ఖాళీగా ఉంది. ఆ టైం లో త్రిష పని అయిపోయింది అనుకున్నారు కానీ ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: