కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేత పట్టణ ప్రాంతాల్లో బాగా పర్యటిస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు. కర్నూలు జిల్లా వాసుల నుంచి ఆయనకు విశేషమైన స్పందన లభిస్తుంది. తనను గెలిపిస్తే ఎప్పటిలాగానే ప్రజల్లో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు బాగోగుల కోసం తాను కృషి చేస్తానని భరత్ చెబుతున్నారు. నాకు ఓటేయండి అంటూ ఆయన తిరుగుతూ ఉంటే ప్రజలు అందుకు సానుకూలంగానే స్పందిస్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో 70 వేలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. వారందరినీ తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ని రంగంలోకి దింపింది.

కృష్ణా జిల్లాకు చెందిన ఇంతియాజ్ కర్నూలు జిల్లాలో ఎలాంటి ప్రజాదరణ కలిగి లేరు. నాన్ లోకల్ కావడమే ఆయనకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. టీజీ భరత్‌ జెట్ స్పీడుతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే.. ఇంతియాజ్ మాత్రం పేలవమైన ఎన్నికల ప్రచారంతో నిరాశ పరుస్తున్నారు. వైసీపీ స్థానిక నేతలు ఇంతియాజ్‌కు కొంచెం కూడా సహకారం అందించడం లేదు. పూర్తిగా కొత్త అయినా కర్నూలు జిల్లాలో స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేస్తేనే ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. కొత్త ముఖాన్ని ప్రజలు త్వరగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు.

కర్నూలు అనేది రాయలసీమలో అతిపెద్ద నగరం. ఇక్కడ 2 లక్షల 58 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇంత పెద్ద అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవాలంటే రాజకీయ ఉద్దండులు అయి ఉండాలి. ఇంతియాజ్ కు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. పాపులారిటీ కూడా శూన్యమే. ఆయన గెలవాలంటే ఒకే ఒక మార్గం వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను హైలెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడమే. ఆ సంక్షేమ పథకాలే చక్కగా అందుతాయని వీటిని వదులుకోవద్దు అంటూ ప్రజలను ఒప్పించి తన వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు ఓటు వేయండి అంటూ తిరుగుతున్న భరత్ ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు కూడా తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: