ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 7 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు కదుపుతున్నారు..అలాగే ఇటు జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి..మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటంతో ఈ సారి కచ్చితంగా గెలుస్తాము అనే భావన పార్టీ నేతలలో ఏర్పడింది..ప్రస్తుతం ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలన్ని కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడంతో. ప్రస్తుతం మేనిఫెస్టో రచ్చ మొదలైంది..


వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలనే తిరిగి అమలు చేస్తూ వాటి స్థాయిని మరింత పెంచుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఉమ్మడి కూటమి మ్యానిఫెస్టోకు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూరంగా ఉంది. టీడీపీ,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేసాయి.. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రముఖ సంస్థ ఇచ్చిన నేవేదిక ప్రకారం..రాష్ట్రంలో పురుష ఓటర్లు మాత్రం టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు మహిళా ఓటర్లలో అధిక శాతం  వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మహిళల పేరిట ఎక్కువగా పధకాలు మంజూరు చేస్తుంది.అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా.. ఇలా అన్ని పథకాలు కూడా వారి పేరుతోనే మంజూరు అవుతున్నాయి. సహజంగా ఈ పథకాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనితో మహిళలలో ఆ పార్టీకే పూర్తి మద్దతు ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో ఘననీయంగా పెరగడంతో ఈ సారి ఇరు పార్టీల మధ్య హోరా హోరి పోరు తప్పదని తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: