చూస్తుండగానే రెండు విడతల ఎన్నికలు అయిపోయాయి. మూడో విడత ఎన్నికకు రంగం సిద్ధం అయింది. ఇక ఏపీ, తెలంగాణలో కూడా వారం రోజుల్లో ప్రచారం ముగియ నుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు టీవీల ముందుకు వస్తున్నారు. జాతీయ, లోకల్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తమ ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు డిబెట్, ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఎన్నికల వేడిని అమాంతం పెంచేస్తున్నారు.  ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇంటర్య్వూ ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఏ ప్రెస్ మీట్లు నిర్వహించారు తప్ప.. ఏ న్యూస్ ఛానల్ గడప తొక్క లేదు. మాజీ సీఎంతో పాటు ప్రధాని మోదీ సైతం పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.


ఈ సందర్భంగా వారు ఇంటర్వ్యూ స్టైల్ ఎలా సాగింది. వారు మాట తీరు వంటి తది తర అంశాలను వారిని ఇంటర్వ్యూ చేసిన హోస్ట్ తెలియజేశారు. కేసీఆర్ రీజనల్ పర్సనాలిటీ అని పేర్కొన్నారు. ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ వేరు.  మాజీ సీఎం అయిన తర్వాత ఆయన వేరు అని వివరించారు. ఇప్పుడు పార్టీలో పునరుత్తేజం నింపడం కేసీఆర్ కు అత్యవసరం. ప్రస్తుతం కేసీఆర్ ఆత్మ రక్షణలో పడ్డట్లు తెలుస్తోంది. ఆయన మాటలు మొత్తం డిఫెన్స్ లో కొనసాగాయి.


ఇక ప్రధాని మోదీ విషయానికొస్తే.. రెండు సార్లు అధికారంలో ఉన్నారు. మరో సారి మోదీనే వస్తారు అని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న క్రమంలో ప్రధాని పూర్తిగా అగ్రెసెవ్ మూడ్ లో ఉన్నారు. ఎన్డీయే నే మరో సారి అధికారంలోకి వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. అందువల్ల మోదీ ఇంటర్య్యూ ఆద్యంతం అగ్రెసివ్ గా సాగింది.  మొత్తానికి ఇద్దరితో ముఖాముఖిలు ఫలప్రదంగా సాగాయని హోస్ట్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: