ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఏ సినిమా యొక్క ప్రచారాలను ఇప్పటి నుండే మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ దేశ వ్యాప్తంగా లభించింది.

ఇక కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఇందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు కూడా ప్రస్తుతం శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ యొక్క మొదటి పాట ఇప్పటికే అద్భుతమైన రీతిలో సక్సెస్ కావడంతో మేకర్స్ ఈ సినిమా యొక్క రెండవ పాటను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూన్ నెలలో ఈ మూవీ యొక్క రెండవ పాటను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండవ భాగం ప్రేక్షకులను ఏస్తాయో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఫహద్ ఫాజీల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa