బాలీవుడ్ లో సన్నీ లియోన్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా ఆమె ప్రస్తానం అందరిని ఆకట్టుకునేదే. తనలో పోర్న్ స్టార్ ని మర్చిపోయి హీరోయిన్ ని మాత్రమే చూడాలి అని చెప్తుంది సన్నీ. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ హడావుడి చేస్తుంది ఈ హీరోయిన్. ఇక ఆమె అప్పుడప్పుడు బాలీవుడ్ లో ఏదోక వార్తతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఏ వార్త వచ్చినా సరే అక్కడ చర్చలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి అనేది తెల్సిందే. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెను కబీర్ బేడీ అనే సీనియర్ నటుడు ఒకరు ఫోన్ నెంబర్ అడిగారు అనే వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. 74 ఏళ్ళ కబీర్ బేడీ ఆమెను నెంబర్ అడగగా, ఆమె మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి, డానియల్ వెబర్ నెంబర్ ఇచ్చింది. అసలు అది నిజం కాదని అంటున్నాడు కబీర్ బేడీ. ఆమె నెంబర్ అడగాల్సిన అవసరం తనకు ఏంటీ అని ప్రశ్నిస్తూ ఇలాంటి కథనాలు ఎందుకు రాస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసాడు. 

 

ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపధ్యంలో ఆమె భర్త డానియల్ వెబర్ కూడా స్పందించారు. కబీర్ బేడీ కి సన్నీ లియోన్ ఎప్పటి నుంచో తెలుసు అని, అసలు తన నెంబర్ అడిగితే తప్పు ఏంటీ అని ఆయన ప్రశ్నించారు. వార్తల కోసం ఇంత దిగజారడం అంత మంచిది కాదని క్లాస్ పీకుతూ ఒక ట్వీట్ చేసాడు. దీనితో దిగొచ్చిన వార్తలు రాసిన వాళ్ళు, ఆ కథనాలను తొలగించారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ నెంబర్ అడగడం ఏమైనా పాపమా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: