- తొలి సంత‌కం మెగా డీఎస్సీ మీదే
- మేనిపెస్టో రిలీజ్‌లో బాబు, ప‌వ‌న్‌తో పాటు బీజేపీ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ కూడా
- 3 వేల నిరుద్యోగ భృతి, త‌ల్లికి వంద‌నం పేరుతో ఒక్కో బిడ్డ‌కు రు. 15 వేలు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైసీపీ మేనిఫెస్టో విడుదల కావడంతో.. కూటమి మేనిఫెస్టో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఇటు బీజేపీ నుంచి సిద్ధార్థ్ నాథ్‌సింగ్ కూడా వ‌చ్చి మ‌రీ మేనిఫోస్టో రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


ఇక వైసీపీ మేనిఫోస్టోతో పోల్చుకుంటే కూట‌మి మేనిఫోస్టో ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌నే చెప్పాలి. మేనిఫోస్టో రిలీజ్ చేస్తోన్న క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాట్లాడుతూ టీడీపీ-జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామ‌ని చెప్పారు. ఇక అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తొలి సంత‌కం మెగా డీఎస్సీ మీదే ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇక రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి క‌ల్పించేలా రూప‌క‌ల్ప‌న చేస్తామ‌ని చెప్పారు.


ఇక నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వ‌డంతో పాటు యేడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వ‌డం.. అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం క‌ల్పిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇక తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు ఇవ్వ‌డంతో పాటు రాష్ట్రంలో స్కిల్ గణన చేపడతాం అని తెలిపారు. ఇక ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలతో పాటు 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తామ‌ని... సమగ్ర ఇసుక విధానం తెచ్చి... ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతామ‌ని బాబు ప్ర‌క‌టించారు. ఏదేమైనా బాబు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని మేనిఫోస్టో రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: