టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో రైతులకు మేలు చేసేలా కీలక ప్రకటనలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతులను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం రైతులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు రైతులకు అదిరిపోయే శుభవార్తలు ప్రకటించారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
 
రాయితీతో సోలార్ పంప్ సెట్లు అందిస్తామని సోలార్ పంప్ సెట్ల ద్వారా మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వం కొనుగోలు చేతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులను అందజేసి అన్ని సంక్షేమ పథకాలు వాళ్లకు సైతం అందేలా చేస్తామని కూటమి నుంచి స్పష్టమైన హామీ లభించింది.
 
పంటలకు బీమా వర్తింపు చేయడంతో రైతు కూలీలకు సైతం ప్రయోజనం చేకూరేలా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాయితీలు అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టి సేంద్రీయ వ్యవసాయం చేసిన రైతులకు ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాలలో తోడ్పాటు అందిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
 
కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేసి రైతులు పంట విషయంలో ఇబ్బందులు పడకుండా చూస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దళారుల దోపిడీకి చెక్ పెట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ అమలు చేస్తామని బాబు వెల్లడించారు. డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రైతులను రాజులను చేసే విధంగా చంద్రబాబు నాయుడు హామీలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు బెనిఫిట్ కలిగేలా బాబు హామీలను ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: