ఆమె అందగత్తె. అందులో డౌటే లేదు. ఒంపులు సొంపులు బాగానే చూపిస్తుంది. అయినా అద్రుష్ఠం ఆమె పక్షం లేదు. దాంతో ఆమెకు ఐరన్ లెగ్ ట్యాగ్ తగిలించేశారు. ఆమె చేతిలో ఒకప్పుడు పెద్ద సినిమాలు ఉండేవి. పెద్ద హీరోలో కాంబోలో పనిచెసింది. 

 

చివరికి ఇలా పడిపోయిందని అంటున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ అల్లు శిరీష్. పవన్ తో అజ్ఞ్యాతవాసి చేసింది. అల్లు అర్జున్ తో నా  పేరే సూర్యా చేసింది. ఇక నాగ చైతన్యతో శైలాజారెడ్డి అల్లుడు చేసింది. ఈ మూడూ సినిమాలూ  మంచి పేరు తెస్తాయనుకుంది. ఎక్కడికో రివ్వున‌ ఎగిరిపోవచ్చు అనుకుంది. కానీ కధ అడ్డం తిరిగింది.

 

సీన్ కట్ చేస్తే ఆమె ఇంకా డౌన్ లోకి వెళ్ళిపోయింది. అను ఇమాన్యుయేల్ కి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదుట. ఈ మధ్యన ఆమె అందంపైన పూర్తిగా ద్రుష్టి పెట్టి మరీ ఫుల్ గ్లామర్ గా మారింది. కావాల్సినంత గ్లామరసం ఒలకబోసేందుకు రెడీ అయింది. అయినా ఎవరూ పలక‌కేదు.

 

దాంతో  అల్లు శిరీష్ తో జత కట్టేందుకు రెడీ అయింది. అల్లు శిరీష్ హీరోగా ఒక్క హిట్ లేదు. పేరు చెప్పుకోవడానికి మెగా హీరోల లిస్టులో ఉంటాడు. ఆయన వెనక బిగ్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ ఉన్నారు. మరో వైపు అన్న అల్లు అర్జున్ ఉన్నారు. మరి వీరిని చూసిందో. మెగా కాంపౌండ్ అనుకుందో కానీ అను ఇమాన్యుయేల్ వచ్చి వచ్చి శిరీష్ పక్కన చేరింది.

 

కనీసం మార్కెట్ లేని అల్లు శిరీష్ కి ఆమెతో నటించడం ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.  కానీ అను ఇమాన్యుయేల్ కి మాత్రం  ఇది డౌన్ ఫాల్ ఎంత ఉందో చెప్పే సీన్ అంటున్నారు. ఈ సినిమా మీద ఆమెకు కూడా పెద్దగా హోప్స్ ఉంటాయనుకోరు కానీ ఏదో మళ్ళీ సినిమాల్లో తానూ ఉన్నానని చెప్పుకుని తెర మీద కనిపించేందుకు మాత్రం ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: