చాలా గ్యాప్ తర్వాత నితిన్ కి ఒక హిట్ సినిమా దక్కింది. ఎప్పుడో త్రివిక్రం అ..ఆ తర్వాత మళ్ళీ భీష్మ సినిమాతో యంగ్ హీరో నితిన్ హిట్ ని అందుకున్నాడు. కానీ అది పూర్తి స్థాయిలో కాదు. ఫస్ట్ టాక్ హిట్ అంతే. కలెక్షన్స్ పరంగా మాత్రం ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. సేఫ్ జోన్ లోకి వచ్చినప్పటికి అనుకున్న లాభాలను రాబట్టడంలో మాత్రం భీష్మ మేకర్స్ కి షాక్ తగిలింది. అందుకు కారణం మాయదారి కరోనా. ఇప్పటికి థియేటర్స్ లో బాగా ఆడుతున్న సినిమా ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోవాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో భీష్మ టీమ్ కి అదే జరిగింది. 

 

ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ సహా అన్ని చోట్లా లాభాల సాధించే దిశగా పయనిస్తోంది. షేర్స్ కూడా బాగా ఉన్నాయన్న టాక్ ఉంది. అయితే సరిగ్గా ఇలాంటి టైమ్ లో కరోనా దాపరించింది. చైనా నుంచి భారత్ వరకూ కరోనా వణికిస్తోంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై ఈ మహమ్మారీ పోటు మరీ దారుణంగా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా అందరిని హడలిస్తోంది. దాంతో థియేటర్స్, షూటింగులు బంద్ అంటూ సినీపరిశ్రమ ప్రకటించింది. ఇక ఉన్నట్టుండి థియేటర్లను బంద్ అనడం వల్ల నితిన్ భీష్మ కి బాగా తగిలింది.

 

 ఏప్రిల్ వరకూ సరైన సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సీజన్ అంతా ఫ్యామిలీ సినిమాగా రన్ అయిపోతుందని నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఎంతో ఆశ పడ్డారు. అందువల్లనే ఆయన థియేటర్ల బంద్ ని వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపడం ఆయన వల్ల కాలేదు. ప్రస్తుతం ఐమ్యాక్స్ సహా హైదరాబాద్ నగరంలోని థియేటర్లన్నీ బంద్ అయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో అన్నిచోట్లా భీష్మకు అనుకున్న వసూళ్ళు రాక పెద్ద దెబ్బ పడింది. ఒక రకంగా చాలా పెద్ద మొత్తంలోనే షేర్ ని భీష్మ నష్టపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈనెల 31 వరకూ థియేటర్లు బంద్ ఉండటంతో భీష్మ మేకర్స్ వసూళ్ళ మీద ఆశలు అన్ని అడియాశలు అయిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: