సోషల్ మీడియాలో ఇన్నాళ్లుగా సాగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు అమీర్ ఖాన్. ట్వీట్లు, రీట్వీట్లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పేశాడు అమీర్. ఇప్పటి వరకు జరిగిందంతా అబద్దపు ప్రచారమని.. దాన్ని ఎవరూ నమ్మొద్దని ట్వీట్ చేశాడు. ఇంతకీ ఈ మిస్టర్ పర్ ఫెక్ట్ నిస్ట్ విషయంలో జరిగిన తప్పుడు ప్రచారమేంటో తెలుసా.. ఆ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఎవరో తెలుసా.. 

 

అమీర్ ఖాన్ పేదలకు డబ్బులు పంచుతున్నాడు. కరోనా కష్టకాలంలో గోధుమ పిండి ప్యాకెట్లో పెట్టి పేదలకు పదిహేను వేల రూపాయలు దానం చేశాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీలోని పేదలకు అమీర్ చాలా పెద్ద మొత్తంలో డబ్బు పెంచాడని సోషల్ మీడియాలో బోల్డన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. దీనిపైనే ట్విట్టర్ లో స్పందించాడు అమీర్. 

 

అమీర్ ఖాన్ సోషల్ రెస్పాన్సిబులిటీ చాలా ఎక్కువ. సామాజికాంశాలపై ఎప్పుడూ గళమెత్తుతూనే ఉంటాడు. సామాజిక రుగ్మతలను రూపుమాపాలని లెక్చర్లు కూడా ఇస్తుంటాడు. సత్యమేవ జయతే అనే టీవీ షోలో పేదరికం, రైతు సమస్యలు, మహిళా సాధికారత, బాలల హక్కులు.. ఇలా బోల్డన్ని విషయాలపై మాట్లాడాడు. దీంతో ఈ హీరో పదిహేను వేలు పంచాడనే ప్రచారాన్ని చాలా మంది నమ్మారు.

 

అమీర్ ఖాన్ డబ్బు పంచాడనే ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేస్తున్నారు. హ్యాష్ ట్యాగులతో అమీర్ ని ఆకాశానికెత్తుకున్నారు. అయితే ఈ వ్యవహారం రీసెంట్ గానే అమీర్ ఖాన్ దగ్గరకు వెళ్లింది. దీంతో ఇదంతా ఫేక్ అని.. నేను ఎవరికీ డబ్బులు పంచలేదని.. వీటిని ఎవరూ నమ్మొద్దని ట్వీట్ చేశాడు అమీర్. మరి ఈ గోధుమ పిండి ప్యాకెట్లలో డబ్బులు పంచిన వీడియో ఎవరు క్రియేట్ చేశారు.. అమీర్ ను ఎందుకు ఇందులోకి తీసుకొచ్చారు అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: