అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ మీనా. అందం అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. తెలుగుతనం ఉట్టిపడే పాత్రల్లో  నటిస్తూ... తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొంది మీనా. అప్పట్లో స్టార్ హీరోయిన్గా కొన్నేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది ఈ హీరోయిన్. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ఆనాడు స్టార్  హీరోయిన్ గా కొనసాగినప్పటి నుంచి నేటి వరకూ మీనా అభినయం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. 

 

 అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీనా లో తెలుగుతనం ఉట్టిపడే అభినయం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఇక మీనా నటించిన పాత్రలు కూడా అభినయం ప్రదర్శించడానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి అని చెప్పాలి. ఇక మీనా నటించిన చాలా సినిమాలకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే ఉంటాయి. అందుకే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి  దగ్గరయింది ఈ హీరోయిన్. ఎక్కడ అందాల ఆరబోతకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా... ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. 

 

 

 ఇక తన ఎవర్గ్రీన్ జోడి అయిన వెంకటేష్ తో కలిసి ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి దృశ్యం సినిమాల్లో నటించి మరో సారి వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి. మరోసారి తన నటనతో దృశ్యం సినిమా లో ఆకట్టుకుంది మీనా. ఇక బుల్లితెరపై అక్కడక్కడ కూడా మెరిసి  ఆకట్టుకుంది. అందుకే ఆనాడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమయంలోనే కాదు ఇప్పటికీ అసలు సిసలైన అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది ఆనాటి హీరోయిన్ మీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: