అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 15వ తారీఖున పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల అయ్యేది. అయితే లాక్ డౌన్ సమస్యతో పరిస్థితులు తారుమారు అవ్వడంతో పవన్ అభిమానుల కోరిక నెరవేరలేదు. వాస్తవానికి పవన్ రీ ఎంట్రీని చాల గ్రాండ్ గా సేలిబ్రేట్ చేస్తూ సోషల్ మీడియాలో బయట హోరెత్తించాలని పవన్ అభిమానులు ఎన్నోవ్యూహాలు రచించారు.


అయితే ఇప్పుడు తమ కోరికను పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ విడుదలై నేటితో 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ‘వకీల్ సాబ్’ విడుదల కానిలోటును ‘గబ్బర్ సింగ్’ ను మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ తమ ఆనందంలో ‘వకీల్ సాబ్’ విడుదల కాని బాధను మరిచిపోతున్నారు. 30 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈమూవీ 11 మేన 2012న రిలీజ్ అయి 150 కోట్లు వసూలు చేసి అప్పట్లో కోట్లు కురిపించుకుని చరిత్ర సృష్టించుకుంది. 


పవన్ కల్యాణ్ స్టైల్ హీరోయిజమ్ దర్శకుడు హరీష్ శంకర్ రచన మాటలు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అభిమానులకు జోష్ ను కలిగించడమే కాకుండా ఇప్పటికీ ఈసినిమా బుల్లి తెర పై ప్రసారం అయితే ఈమూవీకి టి ఆర్ పి రేటింగ్స్ బాగా వస్తున్నాయి అంటే ఈ మూవీలో ఎంత కిక్ ఉందో అర్థం అవుతుంది. పవన్ ఇలాంటి మ్యాజిక్ మళ్ళీ చేద్దామని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీసినా పవన్ అభిమానులు కూడ పవన్ ప్రయత్నాలకు సహకరించలేదు.


నిజానికి ఈసినిమాను రవితేజా ను హీరోగా పెట్టి తీయాలని మొదట్లో ప్రయత్నాలు జరిగాయి అని అంటారు. అయితే రవితేజా తాను గతంలో నటించిన ‘విక్రమార్కుడు’ మూవీలా ఉంటుందని భావించి ఈ ‘గబ్బర్ సింగ్’ ఛాన్స్ ను వదులు కున్నాడు. అలాంటి ‘గబ్బర్ సింగ్’ మరోసారి 8 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించింది. #8YrsOfGabbarSingh Hysteria ట్యాగ్ అతితక్కువ కాలంలో దేశ వ్యాపతంగా ఎక్కువ ట్వీట్లు సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసుకుని కేవలం 34 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్స్ రావడం చూసిన వారికి ‘వకీల్ సాబ్’ విడుదల అవ్వకపోయినా ఆలోటు ఖచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ తీర్చింది అనడంలో ఎటువంటి సందేహంలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: