అక్కినేని వారి కోడలు సమంతకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది యువ హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే సమంత నాగచైతన్య ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.  అయితే సమంత పెళ్ళికి ముందు వరకూ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకర్షించింది. 

 

 

 

 

 పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా గ్లామర్ పాత్రలకు దూరమైపోయింది సమంత. అయితే పెళ్లికి ముందు లిప్ లాక్ సీన్లకు ఒప్పుకుంది  కానీ పెళ్లి తర్వాత మాత్రం అలాంటివి ఏమీ ఉండవు అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ పెళ్లి తర్వాత కూడా లిప్ లాక్ సీన్లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది  సమంత. మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 అయితే రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ కి సమంత డీప్ లిప్ లాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత... అది ఎంతో గొప్ప పేరున్న అక్కినేని వారి కోడలు అయ్యాక కూడా సమంత లిప్ లాక్ సీన్లలో నటించడం అప్పట్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా లిప్ లాక్ సీన్లలో నటించడం ఏంటి అంటూ సమంత పై కొంత మంది విమర్శలు కూడా చేశారు. ఇక పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి అలా చేయాల్సి వచ్చిందని సమంత దీనికి వివరణ కూడా ఇచ్చింది. అయితే సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో మొదటి లిప్లాక్ ఇచ్చింది మాత్రం రామ్ చరణ్ కి  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: