విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రాముడు ఒక కారణజన్ముడు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులు. సినీ జీవితంలో ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో కీలక మలుపులు తిరిగింది ఎన్టీఆర్ జీవితం. ఒక సాదాసీదా వ్యక్తి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నందమూరి తారక రామారావు... ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగి తెలుగువాడి ఖ్యాతిని ఎంతగానో చాటిచెప్పారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేయాలని భావించారు నందమూరి తారక రామారావు. దృఢ సంకల్పంతో ముందుకు సాగిన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి... తరతరాల చరిత్రను తిరగ రాశాడు. ఏకచక్ర ఆధిపత్యం గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి ఒక్కసారిగా తెర మీదికి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు నందమూరి తారక రామారావు. 

 


 అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏకఛత్రాధిపత్యంగా నందమూరి తారక రామారావు తెలుగు రాజకీయాలను శాసించారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రజలు నందమూరి తారకరామారావు పై వ్యతిరేకత తీసుకురావడానికి  ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీలకు కూడా సాధ్యం కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎన్నో ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి... ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని తెలుగు రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారు నందమూరి తారక రామారావు. కానీ ఆ తర్వాత మాత్రం తన సొంత పార్టీలోనే నందమూరి తారకరామారావు స్థానం లేకుండా అయిపోయింది. 

 


 దీనికి కారణం ఏమిటి అనే దానిపై మాత్రం ఎన్నో వాదనలు వినిపిస్తూ ఉంటాయి. నందమూరి తారక రామారావు కనీసం క్యాడర్ మాట వినకుండా ఆయన ఒక్కడే ప్రతి విషయంలో నిర్ణయాన్ని తీసుకునే వారిని... పార్టీకి చెందిన అందరూ  నేతలు ఆయన చెప్పుచేతుల్లో ఉండాలని కోరుకునే వారని ఇది ఒకానొక సమయంలో పార్టీ నేతలకు నచ్చలేదు అనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంటుంది. అంతేకాకుండా తన అల్లుడైన చంద్రబాబు నాయుడు మామ దగ్గర నుంచి పార్టీని కైవసం చేసుకోవడానికి ఎన్నో కుయుక్తులు పన్ని... ఎన్టీఆర్కు ఫ్యామిలీని కూడా దూరం చేసి ఎమ్మెల్యేలలో కూడా ఎన్టీఆర్ పై వ్యతిరేకత వచ్చేలా చేశారు అన్నది కూడా మరో వాదన. అంతేకాకుండా వృద్ధ వయసులో ఉన్న ఎన్టీఆర్ ఏకంగా ఒక పెళ్లైన మహిళలను  రెండో వివాహం చేసుకోవడం కూడా ఎన్టీఆర్కు ప్రజల్లో పార్టీ నేతల్లో  ఎంతో  వ్యతిరేకత తెచ్చిపెట్టింది అనేది మరో వాదన. ఇక వైస్రాయి ఘటన తర్వాత పూర్తిగా నందమూరి తారక రామారావుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు దూరమైపోయారు. దీంతో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకో లేక పోవడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎన్టీఆర్ వదిలిపెట్టాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: