సినిమా హీరోలు అందరూ గా ఫిట్ గా  కనిపించడానికి డైట్ పాటిస్తూ ఉంటారు అన్న విషయం. ప్రత్యేక ఆహార నియమాలను పాటిస్తూ తమ ఫిట్ నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఆహారాలు తినాలని  ఉన్న తినలేని  పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ హాయిగా కెమెరా  ముందు నటించి వెళ్ళిపోతారు అని అనుకుంటారు కానీ చాలా మంది.కానీ  కడుపు కట్టుకొని ఆహారాన్ని తినకుండా పరిమితమైన ఆహారం తింటూ... ఉంటారు. ప్రస్తుతం అందరూ హీరోలు ఇలా డైట్ ప్లాన్ పాటిస్తున్నారు. సిక్స్ ప్యాక్ లు చేసి కండలు పెంచే హీరోల డైట్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు మామూలు డైటింగ్ చేయరు ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. 

 


 కాగా దీనికి  బాలకృష్ణ  అతీతం అని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి  హాజరైన నందమూరి బాలకృష్ణ.... ఆరోగ్యంగా ఫిట్ గా  ఉంచడానికి మీరు ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ ప్రత్యేకంగా ఆహార నియమాలు అంటూ ఏమీ పెట్టుకోడట . ఏది తినాలనిపిస్తే దాని తినేస్తూ ఉంటాడట బాలకృష్ణ. కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో పాత్రలు బట్టి తన డైట్ లో స్వల్ప మార్పులు చేసుకుంటూ ఉంటాడట బాలకృష్ణ. కానీ రాత్రి పూట మాత్రం అస్సలు భోజనం చేయడట... భోజనానికి బదులుగా వేరే ఆహారం తీసుకుంటారట బాలకృష్ణ, ఇలా దాదాపుగా అయితే తనకు తినాలనిపించిన ప్రతి ఆహారాన్ని తింటూనే ఉంటాడట బాలకృష్ణ. 

 

 ఈరోజు నందమూరి బాలకృష్ణ తన 60 ఏటా  అడుగు పెడుతున్న విషయం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అంతేకాకుండా నందమూరి బాలకృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు పలువురు ప్రముఖులు. మరోవైపు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న  సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలై నందమూరి అభిమానుల అందరిలో పండగ వాతావరణం నెలకొంది అనే  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: