ఒకప్పుడైతే కుటుంబంలోని బంధాలను బంధుత్వాలను తెలిపే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇలా వచ్చిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకర్షించి  ఘన విజయం సాధించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో రొమాంటిక్ సినిమాలు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే... కుటుంబ బంధాలను గుర్తుచేసే సినిమాలు  తక్కువ వస్తున్నాయి అని చెప్పాలి. అయితే తెలుగు పరిశ్రమ మొత్తం యాక్షన్ సినిమాలతో రొమాంటిక్ సినిమాలతో నిండిపోయిన తరుణంలో... కామెడీ ఎమోషన్స్ ని పండిస్తూ... అందరి మధ్య ఉన్న బంధాలను బంధుత్వాలను గుర్తు చేస్తూ... నేటి జనరేషన్ జీవితం ఎలా ఉండకూడదో చెబుతూ వచ్చిన సినిమా శతమానం భవతి. 

 

 యువ హీరో శర్వానంద్ హీరోగా... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని ఆకర్షించింది ఎంత మంచి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటితరం జనరేషన్ లో యువత ఎలా ఆలోచిస్తున్నారు అనేదానికి నిలువుటద్దంలా మారిపోయింది ఈ సినిమా. పిల్లలు విదేశాల్లో ఉండి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే... తల్లిదండ్రుల మనసు ఎంత బాధ పడుతుంది అనేది అందరికీ తెలిసేలా చేసింది ఈ సినిమా. వృద్ధాప్యంలో డబ్బులు సౌకర్యాలు ముఖ్యం కాదు పిల్లలు తమ దగ్గర ఉండటమే తల్లిదండ్రులకు ముఖ్యమని నిరూ  పించింది ఈ సినిమా. 

 


 ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా నిజ జీవితంలోని ప్రతి మనిషికి ఎదురైన ఒక పాత్ర  అని చెప్పాలి. అందుకే ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోయారు. చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా కావడంతో ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇక ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో  నటించడం కాదు జీవించారు అని చెప్పాలి. ఈ సినిమాలోని  సన్నివేశాలని మన నిజ  జీవితంలో మన కళ్ల ముందు జరిగిన సన్నివేశాలను  తలపిస్తూ ఉంటాయి. మొత్తంగా ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా మిగిలిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: