నాగార్జున తన పిల్లలు నాగచైతన్య అఖిల్ లు నటించిన రెండు సినిమాల గురించి విపరీతంగా ఆలోచనలు చేస్తూ ఈ రెండు సినిమాలు ఓటీటీ స్ట్రీమ్ లో విడుదల కాకుండా తనవంతు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి చైతన్య అఖిల్ లు నటించిన ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలు ఈ ఏడాది సమ్మర్ రేస్ లో విడుదల అవుతాయని అందరు భావించారు.


దీనికితోడు ఈ రెండు సినిమాల పై చైతు అఖిల్ లు చాల ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు వరస పరాజయాలు అందుకున్న అఖిల్ కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ చాల కీలకంగా మారింది. ఇప్పుడు ఈమూవీని నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ విడుదల చేయాలని గట్టి పట్టుదల పడుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి.


దీనికి కారణం ఇప్పట్లో ధియేటర్లు ఓపెన్ అయ్యే ఆస్కారం లేకపోవడంతో పాటు ధియేటర్స్ ఓపెన్ అయినా జనం వస్తారు అన్న నమ్మకం అరవింద్ కు లేకపోవడం దీనితో ఈ మూవీని ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ఇచ్చేయాలి అన్న ఆలోచన అరవింద్ కు రావడానికి మరొక కారణం కూడ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరిగి పోవడంతో ‘ఆహా’ ను నిలబెట్టడానికి మరింత పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు అరవింద్ కు ఏర్పడ్డాయి అని అంటున్నారు.


దీనితో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీని ఓటీటీ కి ఇవ్వడానికి అరవింద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో ఈ ప్రయత్నాలకు నాగ్ అడ్డుకట్ట వేస్తూ ఈ మూవీ విడుదల ఆలస్యం వల్ల అరవింద్ కు వచ్చే నష్టాన్ని తాను భరిస్తానని నాగార్జున రాయబారాలు చేస్తున్నట్లు టాక్. అదేవిధంగా నాగచైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ నిర్మాత కూడ ఈమూవీని ఓటీటీ కి అమ్మడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ఈసినిమా విడుదల ఆలస్యం వల్ల ఈ మూవీ నిర్మాతకు వచ్చే నష్టాన్ని భరిస్తాను అని నాగ్ చెపుతున్నా వీరిద్దరూ ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులలో ఈ నిర్మాతల ప్రయత్నాలను ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక నాగార్జున తెగ తికమక పడిపోతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: