టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా తెలుగు సినిమా పరిశ్రమకు కథ మాటల రచయితగా పరిచయం అయ్యాడు. వేణు తొట్టెంపూడి హీరోగా లయ హీరోయిన్ గా తెరకెక్కిన స్వయంవరం సినిమాతో ప్రారంభమైంది త్రివిక్రమ్ సినీ కెరీర్. ఆ తర్వాత నుండి వరుసగా పలు సినిమాలకు కథ మాటలు అందించిన త్రివిక్రమ్ వాటితో మంచి పేరు దక్కించుకున్నాడు. అనంతరం తరుణ్, శ్రియ ల కలయికలో తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ దానితో మంచి హిట్ అందుకున్నాడు.

తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు, పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు అర్జున్ తో జులాయి సినిమాలు తీసి మరో మూడు సక్సెస్ లు అందుకుని అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్ అతి త్వరలో మరొక సారి ఎన్టీఆర్ తో తన నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం నుండి ప్రచారం అవుతున్న వార్తలను బట్టి అతి త్వరలో మలయాళ రీమేక్ మూవీ అయిన అయ్యప్పనుం కోషియమ్ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి కథా మాటలు అందించే పనిని దర్శకుడు త్రివిక్రమ్ కు అందించాలని చూస్తున్నారట నిర్మాతలు. కాగా ఆ సినిమాలో పక్కాగా పవన్ నటిస్తేనే  తాను కథారచనలో పాల్గొనటం తోపాటు సినిమాకు మాటలు అందిస్తానని త్రివిక్రమ్ అంటున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఆ సినిమా యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: