డైరెక్టర్ గుణశేఖర్.. పెద్ద పెద్ద సెట్ లకు, భారీ సినిమాలకు పెట్టింది పేరు. ఎందుకంటే.. ఈయన సినిమాలలో సెట్స్ భారీగా ఉంటాయి. ఆర్ట్ వర్క్ చాలా ఉంటుంది. ఆ విషయం ఆయన సినిమాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రామాయణం, మృగరాజు, అర్జున్, సైనికుడు, వరుడు, రుద్రమదేవి వంటి సినిమాలలోని భారీ సెట్టింగులు చూస్తే భారీతనం ఉట్టిపడుతుంది. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల లిస్టు మరియు వాటి ఫలితాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం…
1. లాఠీ: హిట్
2. సొగసు చూడతరమా: హిట్
3. రామాయణం: హిట్
4. చూడాలని ఉంది: బ్లాక్ బస్టర్ హిట్
5. మనోహరం: సూపర్ హిట్
6. మృగరాజు: ఫ్లాప్
7. ఒక్కడు: బ్లాక్ బస్టర్ హిట్
8. అర్జున్: ఏవరేజ్
9. సైనికుడు: డిజాస్టర్
10. వరుడు: డిజాస్టర్
11. నిప్పు: డిజాస్టర్
12. రుద్రమదేవి: హిట్
13. హిరణ్య కశ్యప: ఫలితం ఊహించి చెప్పండి. 
డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం హిరణ్య కశ్యప కథను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా టైటిల్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. గతంలో ఓ సారి దగ్గుబాటి సురేష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే.. హిరణ్య కశ్యప సినిమా ఆగిపోయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ సినిమా ఆగిపోలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని క్లియర్ గా వర్క్ చేసిన తర్వాతే సినిమా షూటింగ్ మొదలు పెడతాం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తాము అని చెప్పుకొచ్చారు. 
డైరెక్టర్ గుణశేఖర్ తన సినీ కెరీర్ లో ఇప్పటివరకూ దాదాపుగా 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో "చూడాలని ఉంది", "ఒక్కడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్, ఐదు సూపర్ హిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం "హిరణ్య కశ్యప" అనే చారిత్రాత్మక సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. టైటిల్ రోల్ లో రానా నటించనున్నాడు. సురేష్ బాబు నిర్మిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: