‘ఆదిత్య 369’ వంటి విజువల్ వండర్ ను మనకు అంధించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెంటర్‌గా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు వెల్లండించారు. అయితే ఈ ప్రాజెక్టు మొదలుకావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి.. ఈ గ్యాప్లో సైలెంట్ గా ఓ వెబ్ ఫిలిం ను తీసేస్తున్నాడట నాగ్ అశ్విన్. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘నెట్ ఫ్లిక్స్’ వారి కోసం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ లో శృతీ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తుందట.
హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో షూటింగ్ కూడా మొదలుపెట్టారట.30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిలింలో శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఇక శృతిహాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో "క్రాక్" అనే మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి మలినేని గోపి చంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి