ఒక సినిమా హిట్ అని తెలియాలి అంటే అది ఎన్నిరోజులు ఆడిందా అని కాదు ఎంత వసూళ్లు రాబట్టయ్యిందా అని అర్ధం. ఇక కలెక్షన్లు రెండు రకాలు అవి ఒకటి గ్రాస్ కలెక్షన్స్.. ఇంకొకటి షేర్ కలెక్షన్స్.. గ్రాస్ కలెక్షన్స్ అంటే థియేటర్లకు సంబంధించిన రెంట్లు చెల్లించాల్సిన ఎమౌంట్ కాకుండా .. మొత్తం సినిమాకు సంబంధించిన టికెట్లు అమ్మగా వచ్చిన ఎమౌంట్ ను గ్రాస్ కలెక్షన్స్ అంటారు. ఇక షేర్ అంటే.. వచ్చిన మొత్తం గ్రాస్ కలెక్షన్స్ నుండీ థియేటర్ రెంట్ లు అలాగే జి.ఎస్.టి లు వంటి టాక్స్ లు పోగా మిగిలినది అన మాట. ఈ షేర్ కలెక్షన్స్ ను బట్టే.. సినిమాకు పెట్టిన బడ్జెట్ మరియు లాభాలను ప్రత్యేకపరిచి.. సినిమా హిట్టా..ఫ్లాపా అన్నది డిసైడ్ చేస్తుంటారు ట్రేడ్ పండితులు. చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు. టాక్ బాగా వచ్చినా.. సినిమాకు కలెక్షన్స్ కనుక రాకపోతే దానిని ప్లాప్ గానే పరిగణిస్తుంటారు. ఇంకో విషయం ఏమిటంటే షేర్ కలెక్షన్స్ బట్టే హీరో రేంజ్ ఏంటన్నది డిసైడ్ అవుతుంది.

సరే ఇదంతా పక్కన పెట్టేసి.. ఇప్పటి వరకూ టాలీవుడ్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం రండి.  IMDB లెక్కల ప్రకారం  ఇక అత్యథిక కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలు ఇండియా హెరాల్డ్ అందిస్తుంది చూడండి...


 
1) బాహుబలి 2 ది కన్క్లూజన్ (2017)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 1807 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 865.1 కోట్లు

2)బాహుబలి 1 : ది బిగినింగ్(2015)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 602 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 311 కోట్లు

3) సాహో (2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 420.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 213.6 కోట్లు

4)సరిలేరు నీకెవ్వరూ (2020)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 274.4 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 162.8 కోట్లు

5) సైరా నరసింహరెడ్డి(2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 248 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 145 కోట్లు

6) అల వైకుంఠపురంలో  (2020)

వరల్డ్ వైడ్ గ్రాస్ :237.1 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 142.4 కోట్లు

7)రంగస్థలం (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ :213.4 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 123.7 కోట్లు

8)మహర్షి(2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 184.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 108.6 కోట్లు

9) భరత్ అనే నేను (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ :178.1 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 102.3 కోట్లు

10) శ్రీమంతుడు (2015)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 165.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 101.9 కోట్లు

11)అరవింద సమేత (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 155 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 89.6 కోట్లు

12)ఖైదీ నెంబర్ 150 (2017)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 151 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 87.5 కోట్లు

13) ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 140.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 82.3 కోట్లు

14)జనతా గ్యారేజ్ (2016)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 138.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 79.3 కోట్లు

15)అత్తారింటికి దారేది(2013)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 135.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 76.8 కోట్లు

16)జై లవ కుశ(2017)

వరల్డ్ వైడ్ గ్రాస్ :130.4 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 73.1 కోట్లు

17)మగథీర (2009)

వరల్డ్ వైడ్ గ్రాస్ :129 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 76.1 కోట్లు

18)గీతా గోవిందం (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ :129 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 75.1 కోట్లు

19)సరైనోడు (2016)

వరల్డ్ వైడ్ గ్రాస్ :126 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 70.1 కోట్లు

20)స్పైడర్ (2017)

వరల్డ్ వైడ్ గ్రాస్ :121.3 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 64.9 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: