అతి త్వరలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కనున్న లేటెస్ట్ సినిమా ఎఫ్3. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత ఏడాది సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్2 సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంది అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం తెరకెక్కనున్న ఎఫ్3 మూవీ దానిని మించేలా మరింత ఫన్ తో ఉంటుందని, అలానే స్టోరీ కూడా ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు టెక్నీషియన్ల ఎంపిక కూడా పూర్తయినట్లు టాక్. ఇకపోతే అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటించనున్నారని, ఆ పాత్రని మహేష్ లేదా రవితేజ లలో ఎవరో ఒకరు చేసే ఛాన్స్ ఉందని ఇటీవల కొన్ని నెలలుగా ఒక వార్త అయితే పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతూ ఉంది.

ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో నిజంగానే మరొక స్టార్ హీరో నటించనున్నారని, అయితే అది సినిమాలో కొన్ని నిముషాలు మాత్రమే ఉండే చిన్న పాత్ర అని, అయితే పక్కాగా ఆ పాత్రని మహేష్, లేదా రవితేజ చేస్తారా లేక మరొక హీరో ఎవరైనా చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: