టాలీవుడ్ లో దాదాపు సగం మంది టాప్ హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవారే.. ఓ రకంగా టాలీవుడ్ లో మెగా కుటుంబం చేసే సినిమాలమీదే ఆధారపడి వందలాది మంది  జీవనం కొనసాగిస్తున్నారని చెప్పాలి. మెగా స్టార్ చిరంజీవి దగ్గరినుంచి వైష్ణవ్ తేజ్ వరకు డజను మంది టాలీవుడ్ లో హీరోలుగా, వివిధ రకాల జాబ్స్ చేస్తూ ఉన్నారు.. హీరోల విషయానికొస్తే అందరు హీరోలు మంచి సినిమాలు చేస్తూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్నారు.  వరుస హిట్ సినిమాలు  చేస్తూ మెగా ఫాన్స్ ని ఎంతగానో అలరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెగా హీరోల్లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్న హీరో ఎవరంటే వరుణ్ తేజ్ అంటున్నారు చాలామంది సినీ అభిమానులు.. వరుణ్ తేజ్ మొదటి సినిమా నుంచి గమనిస్తే ఒక సినిమా కి, ఒక సినిమా కి పొంతన ఉండదు. కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరిన్ని విభిన్నమైన సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ రేట్ తో దూసుకువెళ్తున్నాడు. మొదట్లో ఒకటి రెండు హిట్ సినిమాలు చేసినా లోఫర్ మిస్టర్ సినిమాల తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది.

అంతరిక్షం, తొలిప్రేమ, f2 ఫిదా, గద్దలకొండ గణేష్ ఇలా అయన గత కొన్ని సినిమాలుగా చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినవే.. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ఆ తర్వాత కంచె సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో వరుణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.ఇకపోతే పేష్టుహం బాక్సింగ్ నేపథ్యంలో గని అనే సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంతకుముందు అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్.. ఆ సినిమా టైంలోనే ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఇక బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. వరుణ్ అన్నివిధాలా అంటే శారీరకంగా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని మోషన్ పోస్టర్ లోనే చూపించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: