సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్‌కి సూపర్‌ ఎనర్జీ ఇచ్చింది. ఫెస్టివల్‌ రిలీజులతో థియేటర్లు కొంచెం గాడిన పడ్డాయి. ఈ సరదాని కంటిన్యూ చెయ్యడానికి చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. వారానికి ఇద్దరు, ముగ్గురు హీరోలు బరిలో దిగుతున్నారు.

సంక్రాంతికి వచ్చిన 'క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్' సినిమాలతో థియేటర్లకి బోల్డంత ఎనర్జీ వచ్చింది. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ, సోషల్‌ డిస్టెన్సుల్లాంటి గందరగోళంలోనూ ఆడియన్స్‌ థియేటర్లకి వచ్చారు. నిర్మాతలకు భరోసా ఇచ్చారు. దీంతో సంక్రాంతి తర్వాతి నుంచి రిలీజ్‌కి క్యూ కడుతున్నాయి చిన్న సినిమాలు.

'మహర్షి'లో సపోర్టింగ్‌ రోల్‌ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు అల్లరి నరేష్. రెండేళ్లపాటు స్క్రీన్‌పై కనిపించిన ఈ హీరో ఇప్పుడు 'బంగారు బుల్లోడు'గా వస్తున్నాడు. గిరి దర్శకత్వంలో అల్లరి నరేశ్, పూజా జవేరి లీడ్ రోల్స్‌ ప్లే చేసిన ఈ సినిమా జనవరి 23న రిలీజ్ అవుతోంది.

టీవీ యాంకర్ ప్రదీప్‌ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. 'నీలి నీలి ఆకాశం' సాంగ్‌తో ఆడియన్స్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 29న రిలీజ్ అవుతోంది. అయితే పోయిన సమ్మర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది.

టాలీవుడ్‌ స్టార్లు సమ్మర్‌ని టార్గెట్ చేస్తున్నారు. పెద్ద సినిమాలన్నీ ఏప్రిల్‌, మేని లాక్‌ చేసుకుంటున్నాయి. దీంతో స్టార్‌ హీరోలు గ్యాప్ ఇచ్చిన ఫిబ్రవరి, మార్చిని వాడుకోవడానికి చిన్న సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ పోటీతో ఫిబ్రవరి నెల మొత్తం సినిమాలతో ఫుల్‌ ప్యాక్ అయ్యింది.

చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా లాంచ్ అవుతోన్న సినిమా 'ఉప్పెన'. విజయ్ సేతుపతి విలన్‌గా నటించడంతో ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది. పైగా దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ పాజిటివ్‌ హైప్స్‌తోనే ఫిబ్రవరి5న 'ఉప్పెన' సినిమాని రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నారట నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: