
ఆ సినిమా అప్పట్లో అతి పెద్ద సక్సెస్ సాధించింది. ఇక ఆ తరువాత నుండి స్టార్ హీరోయిన్ గా తెలుగు సహా పలు ఇతర భాషల్లో కూడా వరుసగా ఛాన్స్ లతో కొనసాగిన అనుష్క, అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాల్లో దేవసేన గా తనదైన సహజత్వ నటనతో దేశవిదేశాల్లోని ప్రేక్షకులని కూడా ఎంతో ఆకట్టుకున్నారు. అనంతరం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా భాగమతి సినిమాతో కూడ మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనుష్క శెట్టి, గత ఏడాది నిశ్శబ్దం అనే థ్రిల్లింగ్, సస్పెన్స్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే అమెజాన్ ప్రైమ్ ఒటిటి మధ్యమం లో రిలీజ్ అయిన ఆ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ కాలేదు.
ఇక అప్పటి నుండి ఇప్పటివరకు మరొక సినిమాని అనుష్క ఓకే చేయలేదని సమాచారం. ఇక ఆమెని ప్రేక్షకులు, అభిమానులు చూసి చాలారోజులు అవుతుంది. కాగా నిన్న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో జరిగిన షీపాహి సంస్థ నిర్వహించిన వార్షిక మీటింగ్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు అనుష్క. ఈ సందర్భంగా అనుష్క తో అక్కడి పోలీసులు, అభిమానులు కొందరు సెల్ఫీలు దిగారు. హమ్మయ్య మొత్తానికి చాలారోజుల తరువాత జేజమ్మ దర్శనం అవడంతో ఆమె అభిమానులు ఆనందంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ మీటింగ్ ఫోటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు.....!!