ఒకప్పుడు స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని రెండు మాత్రమే ఉండేవి.. కాని ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ అన్నది కూడా ఒకటి ఏర్పడింది. ఆన్ లైన్ సినిమాలు, వెబ్ సీరీస్ లు, షార్ట్ ఫిలింస్ ఇలా అన్ని రకాలుగా టాలెంట్ ఉన్నారు వారు తమ ప్రతిభని చాటుతున్నారు. యూట్యూబ్ స్టార్స్ గా కొంతమంది ఇప్పటికే తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వీరిలో చాలామంది ఉండగా ఫీమేల్ లీడ్ గా వైష్ణవి చైతన్య సూపర్ పాపులర్ అయ్యింది.

షార్ట్ ఫిలింస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు వెబ్ సీరీస్ లను కూడా చేస్తుంది. అడపాదడపా సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో మెప్పిస్తుంది. వైష్ణవి చైతన్య యూట్యూబ్ పాపులర్ హీరోయినయ్యింది. ఆమె ఏం చేసినా అది సూపర్ అనేలా ఉంది. లేటెస్ట్ గా వైష్ణవి చైతన్య యూట్యూబ్ లో చేస్తున్న వెబ్ సీరీస్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చింది. మిస్సమ్మ అంటూ క్లాసిక్ టైటిల్ తో వెబ్ సీరీస్ వస్తుంది. ఇందులో మహాలక్ష్మి పాత్రలో లీడ్ రోల్ చేస్తుంది వైష్ణవి చైతన్య.

తమలో టాలెంట్ ఉండాలే కాని సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్క్రీన్ ఏదైనా సత్తా చాటొచ్చని ప్రూవ్ చేస్తుంది వైష్ణవి. ఇప్పటికే ఆమె నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సినిమా సూపర్ సక్సెస్ కాగా అదే టీం చేస్తున్న మిస్సమ్మ కూడా సూపర్ హిట్ అయ్యేలా ఉంది. ఈమధ్యనే మొదలైన ఈ వెబ్ సీరీస్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ వెబ్ సీరీస్ తో వైష్ణవి మరింత క్రేజ్ తెచ్చుకునేలా ఉంది.          
                                           

మరింత సమాచారం తెలుసుకోండి: