మన దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతి "హైడ్రోపోనిక్ "వ్యవసాయ పద్ధతి. హైడ్రోపోనిక్‌ పద్ధతిలో మట్టి లేకుండా కేవలం నీళ్లతోనే బంగారంలాంటి పంటలను పండించవచ్చు.  ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌, ఇజ్రాయిల్‌ తదితర దేశాల్లోని రైతులు ఈ పద్ధతినీ అనుసరిస్తున్నారు.అయినా ఇదేదో ఇప్పుడు కనిపెట్టింది కాదు. పూర్వం ఈజిప్టులో ఫారోల కాలంలోనే ఇలాంటి పంట పద్ధతి ఉండేదట. అప్పట్లో ఫారోలు కేవలం నీళ్లతో పండించిన పండ్లు, కూరగాయల రుచి చూశారని చరిత్రకారులు చెబుతారు.ఇంగ్లాండుకు చెందిన తత్వవేత్త ఫ్రాన్సిస్‌ బాకోన్‌ తాను రాసిన "ఎ నేచురల్‌ హిస్టరీ" అనే పుస్తకంలో మట్టి లేకుండా మొక్కలు పెంచే విధానం గురించి చక్కగా వివరించారు. కాలక్రమంలో ఈ విధానం పై అనేక ప్రయోగాలు జరిపి అభివృద్ధి చెందిన ఈ విధానం నేటి తరానికి ఆచరణకు సిద్ధమైంది.

హైడ్రోపోనిక్‌లో పద్ధతిలో ప్రస్తుతం కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే పండిస్తున్నారు.
ఈ పద్ధతిలో ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడరు, ఇవి పూర్తిగా సేంద్రీయ పంటలు కావడంతో  
చాలామంది పట్టణవాసులు అర్బన్‌ కిసాన్‌లుగా అవతారమెత్తుతున్నారు. అందులోనూ ఇవి  అందుకే సెలబ్రిటీలు సైతం ఇలాంటి పంట విధానాలను ఇష్టపడుతున్నారు.

అలనాటి సహజ అందాల తార సుహాసిని హైడ్రోపోనిక్‌ విధానంలో  పాలకూర, గోంగూర, కొత్తిమీర చాలా ఆకుకూరలను చిన్నపాటి స్థలంలోనే చక్కగా పండిస్తున్నారు. త్వరలో తాను భారీ స్థాయిలో ఈ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు పెంచుతానని చెబుతోంది సుహాసిని.

శిల్పాశెట్టి హైడ్రోపోనిక్‌ పద్ధతిలో రకరకాల ఆకుకూరలను పండిస్తోంది. 'తినే ఆహారం స్వచ్ఛంగా ఉండాలన్నది నా అభిప్రాయం.తన కుటుంబానికి స్వచ్ఛమైన సేంద్రియ ఆహారాన్ని అందివ్వడమే తన లక్ష్యమని, అందుకే ఇంటినే ఆధునిక వ్యవసాయ పొలంగా మార్చాలి అన్నది ఆమె అభిప్రాయం.

హీరోయిన్ సమంత ఆహారం విలువ తెలియాలంటే ఇంట్లోనే పంటలు పండించాలని కోరుతూ 'గ్రో విత్‌ మీ' పేరుతో ప్రచారం మొదలుపెట్టింది. సమంత టెర్రస్ గార్డెనింగ్ తో పాటు హైడ్రోపోనిక్ పద్ధతులు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తోంది. 'గ్రో విత్‌ మీ' ప్రోగ్రాం లో భాగంగా హైడ్రోపోనిక్‌ పద్ధతిలో మొక్కలు పెంచమని హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఛాలెంజ్‌ కూడా విసిరింది. దాన్ని స్వీకరించిన రకుల్‌ కూడా సమంత బాటలోనే వెళ్ళిపోతుందని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: