టాప్ హీరోల సినిమాలంటే ఖచ్చితంగా చేజింగ్ సీన్స్ ఉండితీరాలి. విలన్ మనుషులు మన టాప్ హీరోలను వెంటాడుతూ ఉంటే వారికి దొరకుండా అత్యంత ఖరీదైన తమ ఫ్యాషన్ బైక్స్ పై మన టాప్ హీరోలు చేసే సాహసాలు సినిమా ఘన విజయానికి కీలకంగా మారుతూఉంటాయి. అటువంటి సీన్స్ లో తమ అభిమాన హీరోలను చూసుకునే యువత తమను తామే మరిచిపోతూ ఉంటారు.

అయితే ఇక రానున్న రోజులలో టాలీవుడ్‌ సినిమాల్లో ఇకపై ఈ చేజింగ్ సీన్స్ కనపడవు అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలలో చూపెడుతున్న ఈ తరహా సీన్స్ యువతపై విపరీతంగా ప్రభావాన్ని చూపెడుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ భావిస్తున్నట్లు టాక్. దీనితో ఆ చేజింగ్‌ సీన్స్‌ను సినిమాలలో చూపించకుండా బ్యాన్ చేయడం ఒక్కటే మార్గమని ఈ శాఖ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై ఎటువంటి విధాన నిర్ణయాలు తీసుకుని సెన్సార్ బోర్డుకు తెలియచేయాలి అన్న విషయమై ఈ శాఖలోని కొందరు అధికారులు ఈ విషయమై ఎదురయ్యే న్యాయపరమైన విషయాల పై కూడ ఆలోచన చేస్తున్నట్లు టాక్. సినిమాలలో హీరోల బైక్ చేజింగ్ సీన్స్ బ్యాన్ చేస్తే కొంత వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఈ శాఖ ఆలోచన అని అంటున్నారు.

టాప్ హీరోలు స్పీడ్‌గా వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ రూల్స్‌ని పట్టించుకోకుండా హీరోలు తమ బైక్స్ పై పరుగులు తీయడం లాంటి సన్నివేశాలు నేటి తరం ఆలోచనలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నట్లుగా ఈమధ్య ఒక సర్వే వెల్లడించిందని తెలుస్తోంది. 15, 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత‌పై ఈ సినిమాల ప్రభావం ఎక్కువగా వుంటోందని ఈ సర్వే వెల్లడించడంతో సినిమాలలో ఈ చేజింగ్ సీన్స్ బ్యాన్ చేస్తే కొంత వరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు అని కొంతమంది రవాణ శాఖ అధికారులు ఆలోచిస్తున్నట్లు టాక్. అయితే ఈ వార్తలే నిజం అయితే టాప్ హీరోల హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఇటువంటి సీన్స్ లేకుండా సినిమాలు వస్తే సినిమాల భారీ కలెక్షన్స్ కు గండి కొట్టే ప్రమాదం ఉండని అప్పుడే మన టాప్ హీరోలు టెన్షన్ పడిపోతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: