సినిమా ఇండస్ట్రీకి కొంతమంది హీరోయిన్లు వస్తారు. కేవలం వారు ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతూ ఉంటారు. సినిమాలు హిట్ అయినప్పటికీ వారికి తరువాత అవకాశాలు వస్తాయి అన్న గ్యారెంటీ ఉండదు.గ్యారెంటీ కాదు అసలు అవకాశాలు రావనే చెప్పాలి. కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు' హీరోయిన్ అన్షునే తీసుకోండి.. ఆమె రెండో చిత్రం 'రాఘవేంద్ర' తరువాత ఇక ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇలా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శృతీ రాజ్ కూడా ఒకరు. శృతి రాజ్ ఎవరు అనుకుంటున్నారా? ఈమె తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. దివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారి డైరెక్షన్లో వేణు హీరోగా వచ్చిన 'వీడెక్కడి మొగుడండీ' మూవీతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ చిత్రం అప్పుడు మరీ అంత హిట్ కాకపోయినా ఒక రకంగా ఆడింది. అయితే ఆ సినిమా తర్వాత ఇ.సత్తిబాబు డైరెక్షన్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'ఓ చినదాన' చిత్రంలో నటించింది.



ఇక ఈ సినిమా అయితే ఈమెకు మంచి హిట్ ను అందించిందనే చెప్పాలి.ఇక ఆ సినిమాలో ఈ హీరోయిన్ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. దాంతో శృతికి వెతుక్కుంటూ చాలా అవకాశాలే వచ్చాయి. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఈమెను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడట. ఈ విషయం పై ఆమె సీరియస్ అయ్యి.. పెద్ద వాళ్ళను ఆశ్రయించినా.. ఆ నిర్మాత పలుకుబడి ముందు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందట.దాంతో ఈ హీరోయిన్ తమిళ, మలయాళం ఇండస్ట్రీల వైపు వెళ్లినట్లు తెలుస్తుంది.2008 వరకూ ఈమె సినిమాల్లో నటించింది. తరువాత కొత్త హీరోయిన్ల ఎంట్రీతో అవకాశాలు తగ్గిపోయాయట.ఈ నేపథ్యంలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. 41ఏళ్ళ వయసు వచ్చినా ఈమె అందం చెక్కు చెదరలేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.







 

మరింత సమాచారం తెలుసుకోండి: