ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి బజ్ నే క్రియేట్ చేసింది అయితే
ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమా టీజర్ చూసిన కొందరు సినీ ప్రేమికులు... ఈ సినిమా పాత బలరామకృష్ణులు సినిమా ను కాస్త పోలి ఉందంటూ చెబుతున్నారు. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ శివ నిర్వాణను ఓ విలేఖరి ఇదే ప్రశ్న అడుగగా.. దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు శివ. ఆ ప్రశ్నకు స్పందించిన డైరెక్టర్ శివ మాట్లాడుతూ... జగదీష్ చిత్రం బలరామకృష్ణులు సినిమాను పోలి ఉంది అనడంలో ఎంత మాత్రం నిజం లేదు.
ఆ వార్తలన్నీ కూడా నిరాధారమైనవి అనే చెప్పాలి. ఏదో ఒక పాయింట్ తీసుకుని సినిమా స్టోరీ ని డిసైడ్ చేయలేము. ఈ చిత్రంలో నటుడు జగపతి బాబు నాని కి అన్నగా నటించడంతో... బహుశా అలా అనుకుని ఉంటారు. కానీ ఇది పూర్తిగా విభిన్నమైన కథ. ఒకవేళ నేను ఓ ఇన్నోసెంట్ అబ్బాయి.. ఓ గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడే కథతో సినిమా తీసి ఉంటే మీడియా వారు ఓల్డ్ చంటి సినిమాతో పోల్చి ఉండేవారు. అవన్నీ ఎప్పుడూ జరిగేవే అని తెలిపారు. అంతే కాదు ఆ సమయంలో శివ పక్కనే ఉన్న హీరో నాని కూడా.. ఈ విషయంపై మాట్లాడారు. ఇలాంటి వార్తల వలన మాసినిమాకి ఇంకాస్త పబ్లిసిటీ పెరిగి ప్లస్ అవుతుంది అంటూ నాని అనడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈ చిత్రంతో నాని మంచి విజయాన్ని అందుకుంటాడా తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి