కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అయిన ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. కంగనా అంటే ఎప్పుడూ విమర్శలు ప్రతివిమర్శలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కానీ ఒక లేడీ ఎంతో దైర్యంగా...ఏమాత్రం సంకొంచించకుండా నిర్భయంగా అనుకున్నది అనుకున్నట్లు..ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ముందుంటుంది కంగనా. అన్యాయం అనిపిస్తే ఎదిరించడం,నచ్చని విషయాన్ని ముక్కు సూటిగా చెప్పడం ఆమె శైలి.

ఇలాంటి మనస్తత్వం వల్ల ఆమె ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకుంది..అయినా సరే ఎవరికోసం ఆమె వైఖరిని మార్చుకోలేదు. ఇక నటన పరంగా ఈమె ప్రతిభ గురించి చెప్పక్కర్లేదు. విభిన్న పాత్రలను ఎన్నుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి 100 పర్సంట్ ఇస్తుంది. ప్రస్తుతం ఈమె తలైవి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో చేస్తున్నారు  కంగనా. ఇక నటి జయలలిత విషయానికొస్తే ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత ప్రభంజనం సృష్టించారు .

ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ట్రైలర్ చూస్తుంటే.. జయలలిత మళ్లీ దిగొచ్చి నటించిందా అనే రేంజ్‌లో కంగనా తన నటనతో జయలలిత పాత్రకు ప్రాణం పోసింది. తలైవి చిత్రం నుంచి  "చలి చలి" అనే సాంగ్ తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటలో కంగన జలకాలాటలు అందరినీ అలరించాయి. అయితే ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా 16 గంటలు నీటిలోనే తడుస్తూ ఉందట . వాస్తవానికి ఇది ఎంతో రిస్కీ ఫీట్ ... అయినప్పటికీ ఆమె ఎంతో పట్టుదలతో ఈ పాటను పూర్తి చేసిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: