స్టైలిష్ అల్లు అర్జున్ గత ఏడాది సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన "అల వైకుంఠపురంలో" సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.ఇక ఆ సినిమా తరువాత సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం 'పుష్ప' టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.ప్రస్తుతం ఈ టీజర్ యూ ట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుంతుంది.ఊరమాస్ అవతారంలో బన్నీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందని బన్నీ, సుకుమార్ లు ఆలోచిస్తున్నారట.దానికి కారణాలున్నాయి. 'పుష్ప' చాలా పెద్ద  కథ. ఇప్పటివరకు రాసుకున్న సన్నివేశాలను తీస్తే మూడు గంటలకు పైగా ఫుటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అదీ కాకుండా.. సుకుమార్ దగ్గర ఈ సినిమాని కొనసాగించే పాయింట్ కూడా ఉందట.


ఆ రెండు కలిపి ఒకేసారి సినిమా తీసేసి.. రెండు నెలల గ్యాప్ లో ఈ రెండు భాగాలను విడుదల చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై అటు బన్నీ, ఇటు సుకుమార్ లు ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఒకే భాగంగా సినిమాను విడుదల చేయాలనుకుంటే.. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుంది. లేదంటే వాయిదా పడే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. 'బాహుబలి' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. ముందు ఒక సినిమానే తీయాలనుకున్నారు కానీ కథ విస్తారం పెరిగి రెండు భాగాలుగా సినిమా తీశారు. ఇప్పుడు 'పుష్ప' విషయంలో కూడా అలానే జరుగుతోంది. ఇక 'పుష్ప' సినిమా చాలా బాగా నచ్చుతుందట అందరికి. ఖచ్చితంగా ఇది బాహుబలి రికార్డులని బీట్ చేసే అవకాశం ఉందని చిత్రబృందం భావిస్తుంది. ఇంతవరకు బాహుబలి రికార్డులని ఏ సినిమా బ్రేక్ చెయ్యలేకపోయింది. ఇక ఈ సంవత్సరంలో రాబోతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో హిట్ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా బాహుబలి బీట్ చేసే అవకాశాలు వున్నాయట. చూడాలి మరి పుష్ప బాహుబలిని తలదన్నే హిట్ అవుతుందో లేదో. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: