వకీల్ సాబ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆదరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటనకు అందరు ఫిదా అవగా ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసిన మగువలు అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ లకు మంచి పేరొచ్చింది.. వేణు శ్రీ రామ్ దర్శకత్వానికి వందకు వంద శాతం మార్కులు పడగా ఓవరాల్ గా ఈ సినిమా కి బ్లాక్ బస్టర్ బిరుదు ఇచ్చేశారు ప్రేక్షకులు.. ఇక ఈ సినిమా లోని కీ పాయింట్స్ ని వెతకడం మొదలుపెట్టారు ప్రేక్షకులు..
 ఈ సినిమా నుంచి మొదటి పాటగా వచ్చిన మగువ మగువ సాంగ్ ని వింటూ వింటూ ఆ పాట లిరిక్స్ కి ఫిదా అయిపోతున్నారట అందరు. పాట వచ్చి చాలా రోజులే అయినా సినిమా చూశాక పాట ను ఓన్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు.. పాటను వింటూ అందులోని లిరిక్స్ ని గమనిస్తూ ఈ పాటలో ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.. మహిళలు చేసే త్యాగాలను కళ్ళకు కట్టినట్లుగా పాటలో ఇమిడించారు గీత రచయిత.. దానికి అద్భుతమైన బాణీ వెరసి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

విజువల్ గా కూడా పాట ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.. ఈ పాట ద్వారా మహిళల్లోని అమాయకత్వాన్ని క్లియర్ గా చూపించి వారి గొప్పతనాన్ని విజువల్ గా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో ఇదే సాంగ్ ను లేడీ వెర్షన్ లో ఉంచారు. లిరిక్స్ మొత్తం మార్చేసి లేడీ సింగర్ తో పాడించారు. అన్యాయమైన కేసు వెన్నాడుతున్న వేళ యువతులు అనుభవిస్తున్న నరకయాతనను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ పాట ఎంతో హృద్యంగా ఉంది. ఈ పాటకు సంబందించిన లిరిక్స్ ని గీత రచయిత నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అందరు అభినందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: