అదేమిటో తెలియదు కానీ కొందరు దర్శకులకు కొన్ని నిర్మాణ సంస్థలకు అవినాభావ సంబంధం ఏర్పడుతూ ఉంటుంది.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - వంశీపైడిపల్లి, హారిక హాసిని - త్రివిక్రమ్, సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్. ఇలా ఎందుకో కొందరు దర్శకులు ఆయా నిర్మాణ సంస్థలకు ఎటాచ్ అయిపోతుంటారు.. రంగస్థలం సినిమా నుంచి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కు సుకుమార్ కు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈ సినిమాతో కోట్ల రూపాయల మేర సుకుమార్ లాభాలు తెచ్చి పెట్టడంతో ఈ నిర్మాణ సంస్థ నిర్వాహకులు సుకుమార్ ను బాగా నమ్మారు. అప్పటి నుంచి వారు చేస్తున్న ప్రతి సినిమాకి సుకుమార్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూనే ఉన్నాడు. 

ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఉప్పెన సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. పేరుకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమా అయినా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి చివరి ఫైనల్ కట్ వచ్చే వరకు అన్ని సుకుమార్ చేతుల మీదు గానే జరిగాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సుకుమార్ వైష్ణవ్ తేజ్ క్రేజ్ ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా వైష్ణవ్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కోసం రెండు సినిమాలు చేయించే పనిలో ఉన్నాడట సుకుమార్. 

అంటే వైష్ణవ్ కి తగ్గ కథ రెడీ చేయడం దానికి సరైన దర్శకుడిని సెట్ చేసి షూటింగ్ ప్రారంభించడం సుకుమార్ బాధ్యతగా చెబుతున్నారు. మొత్తం మీద వైష్ణవ్ ని ఒక దత్తత తీసుకున్న పుత్రుడులా సుకుమార్ ఆయన కోసం కథలు రెడీ చేస్తున్నట్లు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవ్ క్రేజ్ వాడుకుని మైత్రికి, మైత్రి క్రేజ్ వాడుకుని వైష్ణవ్ మంచి హిట్స్ ఇవ్వడానికి సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నమాట. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది వేచి చూడాలి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: