పూర్తి వివరాల్లోకి వెళితే..మారిముత్తు అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని తమ్ముడు చెన్నై లో ఉంటూ సినిమాలో నటించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మారిముత్తు కూడా సినిమాల్లో కనిపించాలన్న కోరిక పెరిగింది.. అయితే ఎలా ఆఫర్లు దక్కించుకోవాలి అన్న సంశయంతో ఉన్న అతనికి... అతని తమ్ముడు అన్నకు ఇలా చెప్పాడు, అన్న ప్రాణం పోకుండా గొంతు కోసుకుని వీడియో తీసి నాకు పంపు, దానిని సోషల్ మీడియాలో పెడతాను. అప్పుడు ఆ వీడియో వైరల్ గా మారి సినీ ప్రముఖుల దగ్గరకు సైతం చేరుతుంది. ఆ తర్వాత నీ టాలెంట్ చూసి అవకాశాలు వాటికవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అని తలకుమాసిన సలహా ఇచ్చాడట.
మారిముత్తు ముందూ వెనకా ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు.... తమ్ముడు చెప్పింది నమ్మి, శుక్రవారం రోజు ఆఫీస్ నుండి రాగానే తన గొంతు తానే కోసుకుని వీడియో తీశాడు. మారిముత్తు ఎంతకీ గదిలోనుండి బయటికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా... మారి ముత్తు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత అతన్ని విచారించగా, సినిమాలోకి వెళ్లాలని ఆశతోనే తమ్ముడు ఇచ్చిన సలహా ఫాలో అయ్యానని పోలీసులకు షాక్ ఇచ్చాడు. దాంతో అధికారులు, మారి ముత్తు పై అతని తమ్ముడి పై కేసు నమోదు చేశారు. సినిమాల్లో నటించాలనే ఆశ ఉండొచ్చు కానీ... ఆ కోరిక మన ప్రాణాలను తీసే విధంగా మారకూడదని అంటున్నారు ఇది విన్న నెటిజన్లు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి