తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ తరువాత చెప్పుకో తగ్గ పెద్ద సీజన్ సమ్మర్. ‘సమ్మర్ విజేత’ ఎవరు అంటూ అనేక చర్చలు కూడ జరిగేవి. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల ఈసారి సమ్మర్ సీజన్ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. ఇలాంటి పరిస్థితులలో కూడ టాలీవుడ్ హీరోలు నిర్మాతలు దర్శకులు ఏమాత్రం టెన్షన్ పడటం లేదని టాక్.
గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ పరిస్థితులు ఏర్పడి సినిమా హాళ్ళు షూటింగ్ లు మూత పడినప్పుడు ఇండస్ట్రీ వర్గాలు విపరీతంగా టెన్షన్ పడ్డాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో కనిపించడంలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం సమ్మర్ సీజన్ పోయినప్పటికీ దసరా దీపావళి సీజన్ కు పూర్తిగా పరిస్థితులు చక్కబడి పోతాయని ఆ సమయానికి దేశంలో చాల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందికాబట్టి మళ్ళీ ధైర్యంగా ప్రేక్షకులు ధియేటర్స్ కు వస్తారు కాబట్టి ప్రస్తుతం టెన్షన్ పడేదానికన్నా ఇదే సంవత్సరం రాబోతున్న పండుగల సీజన్ ను గురించి ఆలోచించడం మేలు అన్న పాజిటివ్ ఆలోచనలలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికితోడు ఇండస్ట్రీలోని లైట్ బాయ్ దగ్గర నుంచి డ్రైవర్ వరకు ఇలా అందరికీ ఈ ఆరు నెలల లోపున వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయ గలిగితే ఇక ఇండస్ట్రీకి ఎటువంటి భయాలు ఉండవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 1940 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలనే అప్పటి ఫిలిం ఇండస్ట్రీ ఎదుర్కుని మళ్ళీ పూర్తిగా నిలదొక్కుకున్న గతాన్ని తలుచుకుంటూ ఈసారి ఫిలిం ఇండస్ట్రీ మరింత అద్భుతంగా రాణించి నిర్మాతలకు బయ్యర్లకు కాసులు కురిపించి తీరుతుంది అన్న పాజిటివ్ ఆలోచనలలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.
దీనితో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను భయపడకుండా చాలామంది హీరోలు దర్శకులు నిర్మాతలు ప్రస్తుతం వారికి ఉన్న ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా యోగా చేస్తూ అదేవిధంగా కొంత సేపు ధ్యానం చేసుకుంటూ రాబోతున్న దసరా దీపావళీ ఆపై వచ్చే సంక్రాంతి సీజన్ లు తమకు పూర్తిగా కలిసి వస్తాయి అన్న నమ్మకంతో కాలం గడుపుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి