తాజ్ మహల్ సినిమా ఏప్పటికి మన అందరి మదిలో చెదరని ఒక ముద్రలాగానే మెదిలిపోతుంది కదా. ఒక మంచి ప్రేమ కథతో కుడిన చిత్రం అది.తాజ్ మహల్ సినిమాలో నటించిన నటులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.అయితే తాజ్ మహల్ సినిమా గురించి మన అందరికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఏంటో ఒకసారి చూద్దామా. !తాజ్ మహల్ సినిమాను డైరెక్టర్ ముప్పలనేని శివ డాక్టర్ డి రామానాయుడికి చెప్పగానే ఆయన పాజిటివ్ గా స్పందించి ఒకే తీసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.అయితే  మొదటగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ని హీరోగా తీసుకుందామని అనుకున్నారట.కానీ ఈ సినిమా కథను విని కొత్త హీరో అయితే బాగుంటుందని వెంకీ రిజెక్ట్ చేసాడట.ఆ తరువాత ఛాన్స్ హీరో హరీష్ ను వరించగా, అప్పటికే హరిష్ కొండపల్లి రత్తయ్య మూవీలో నటిస్తున్నందున డేట్స్ కుదరలేదు అంట.



ఆ తరువాత హీరో శ్రీకాంత్ ని పెట్టి తీద్దాం అని చెప్పడంతో రామానాయుడు ఒకే చేసేరట. అలా తాజ్ మహల్ సినిమాతో హీరో శ్రీకాంత్ దశ మారిపోయింది. హీరో ఓకే అయ్యాడు. ఇకపోతే విలన్ ఎవరా అని అనుకుంటున్నా తరుణంలో బాలీవుడ్ విలన్ ని తీసుకుందామని నాయుడు గారు అనుకున్నారట.కానీ రియల్ స్టార్ శ్రీహరిని ముప్పలనేని శివ సెలక్ట్ చేసారట. అలాగే హీరోయిన్ గా మోనికా బేడీని ఒకే చేద్దామనుకుంటే ఆమె ఒప్ప్పుకోలేదు.డైరెక్టర్ మొత్తం వివరించి చెప్పడంతో ఆమె సరే అందట. మ్యూజిక్ డైరెక్టర్ గా రామానాయుడు సూచించిన ఎం ఎం శ్రీలేఖ పేరును ఒకే చేసారు. అయితే ఈ సినిమా శ్రీకాంత్ కి,శ్రీహరికి, శ్రీలేఖకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఈ సినిమాతో ఎలాగయినా సక్సెస్ రాబట్టాలని  ముప్పలనేని చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.



ఎందుకంటే అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణతో ఘరానా అల్లుడు తీసి పరాజయం పాలయ్యారు. అందుకే తాజ్ మహల్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపన పెరిగింది. ఇకపోతే సినిమా విషయానికి వస్తే మోనికాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్, అందుకు ఒప్పుకొని అన్నయ్యగా శ్రీహరి కుట్రలు, మధ్యలో సంఘవి ఎంట్రీ ఇలా ఆద్యంతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో కధ ఉంటుంది. 1995లో వచ్చిన ఈ మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. ఈ సినిమాతోనే గేయరచయితగా చంద్రబోస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో  శ్రీహరి నటనకు  నంది అవార్డు వచ్చింది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మ్యూజికల్ హిట్ మూవీగా కాసుల పంట పండించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: