సినిమా ఇండస్ట్రీలో దర్శకులు హీరోల కాంబినేషన్స్ ఎంత ఆసక్తిగా ఉంటాయో అందరికీ తెలిసిందే.. వీరి కాంబినేషన్లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే అభిమానులు మరో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా వీరి కలయికలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొంతమందికి తనివితీరదు.. తెలుగు సినిమా పరిశ్రమలో అలాంటి కాంబినేషన్ లలో ఒక కాంబో కోడిరామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్.. వీరి కాంబో లో మొత్తం ఆరు సినిమాలు రాగా వాటిలో అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి..

మరి ఆ సినిమాలు ఏంటి.. ఏ రేంజ్ లో ఆ సినిమాలు హిట్ అయ్యాయి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. 1987వ సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మొదటి తలంబ్రాలు..  రాజశేఖర్ నటించిన ఈ సినిమా కి  నంది అవార్డు అందుకున్నాడు రాజశేఖర్..  ఈ సినిమా లో రాజశేఖర్ పండించిన విలనిజానికి ఆయనకు బెస్ట్ విలన్ కేటగిరీలో నంది అవార్డు వచ్చింది.. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆహుతి..  ఈ సినిమా టాలీవుడ్ లో సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.. జీవిత కథానాయికగా నటించిన ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బి బెస్ట్ సినిమాగా చెప్పొచ్చు..

అదే సంవత్సరం వీరి కాంబినేషన్ లో స్టేషన్ మాస్టర్ సినిమా కూడా వచ్చింది..  ఆ సినిమా కూడా సూపర్ హిట్ కాగా ఇందులో రాజేంద్రప్రసాద్ కూడా మరో హీరోగా నటించాడు.. ఇక వీరిద్దరి కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా నిలిచిన చిత్రం అంకుశం.. జీవిత హీరోయిన్ గా నటించిన సినిమా 1989 సంవత్సరంలో రిలీజ్ కాగా తెలుగు సినిమా హిస్టరీ ని తిరగరాసింది.. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకి రీమేక్ కావడం విశేషం.. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా నాయకుడు.. ఈ సినిమా వచ్చే సమయానికి వీరిద్దరి కెరీర్ లు ఫేడ్ అవుట్ అయిపోవడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.. ఎదేమైనా కోడి రామకృష్ణ రాజశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ లు అవడంతో పాటు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమాలు గా కూడా నిలిచిపోతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: