అక్కినేని వారి కోడలు సమంత మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2. మొన్నటి వరకూ సినిమాల్లో క్యూట్ క్యూట్ పాత్రలతో అలరించిన సమంతా ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో ఒక్కసారిగా నెగిటివ్ పాత్రలో నటించింది. దీంతో మొదటి నుంచి ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అంచనాలు పెంచేసిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ఇటీవలే విడుదలైంది. ఇక ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ అంచనాలను అందుకున్నట్లు తెలుస్తోంది.



 ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తొలి సీజన్ ఢిల్లీలోని గ్యాస్ లీకేజ్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. అంతేకాకుండా శ్రీలంక ఇండియా లండన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ. కాగా ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో ప్రతి ఒక్కరు ఎవరికివారు పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. ఇక ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ రెండవ ఎపిసోడ్లో అందరూ ఎదురుచూస్తున్న అక్కినేని సమంత ఎంట్రీ ఉంటుంది.



 స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే రాజీ అనే పాత్ర లో నటిస్తుంది సమంత. యజమాని వేధింపులు బస్సులో ఆకతాయిల టీసింగ్ లను ఎంతో ఓపికగా భరిస్తూ ఉంటుంది. ఇక రోజు ఉగ్రరూపం దాల్చి ఏకంగా బస్సులో ఆకతాయిని హతమారుస్తుంది. ఇక ఆ తర్వాత సమంతకు తమ నాయకుడి దగ్గర నుంచి పిలుపు వస్తుంది  అక్కడి నుంచి సమంత పాత్ర అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తంలో సమంత పాత్ర ఎంతో కీలకంగా మారిపోయింది. అంతేకాకుండా ఇక ఆ పాత్రలో సమంత నటన హైలెట్గా నిలిచింది. సమంత తనలోని నటి కి ఈ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. సమంత గ్లామరస్ రోల్ అయినప్పటికీ  అటు ప్రేక్షకులందరినీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: