తన ఎనర్జిటిక్ మ్యూజిక్.. మ్యాజిక్ చేసేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అందరూ ముద్దుగా డీఎస్పీ అని పిలుచుకుంటారు. నేడు సంగీత మాంత్రికుడి పుట్టినరోజు.  1979వ సంవత్సరం ఆగస్ట్ 2వ తేదీన గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని వెదురుపాక వీరి స్వగ్రామం. దేవిశ్రీ ప్రసాద్ చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. ఎందుకంటే వారి కుటుంబం శాస్త్రీయ సంగీతంలో విరాజిల్లుతూ ఉండేది. అసలు దేవిశ్రీప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి.. అత్తగారి పేరులోని దేవి.. మామగారి పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా కూర్చి ఆ పేరు పెట్టారు.  సింపుల్ గా డీఎస్పీగా సంగీత ప్రియుల చెవుల్లో మార్మోగిపోతున్నాడు.

చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్న దేవిశ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే మాండొలిన్ నేర్చుకున్నాడు. మాండొలిన్ శ్రీనివాస్సంగీత దర్శకుడి గురువు. సత్యమూర్తి గారి మగ్గురు సంతానంలో దేవిశ్రీ మొదటివాడు. దేవిశ్రీ తర్వాత సాగర్.. ఆ తర్వాత పద్మిణి ఉన్నారు. ఇక సాగర్ కూడా మంచి గాయకుడు కావడం విశేషం. దేవిశ్రీ చెల్లెలు పద్మిణి ప్రముఖ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు.  

టాలీవుడ్, కోలీవుడ్ లలో దేవిశ్రీ పేరు చెబితే కుర్రకారు పాటలు పాడేస్తారు. అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అంతేకాదు బాలీవుడ్ లోనూ తన సత్తాచాటుతున్నారు. డింకచిక, ఆ అంటే అమలాపురం పాటలు యూత్ ను స్టెప్పులేసేలా చేశాయి. ఇటీవల సిటీమార్ కూడా మంచి టాక్ సంపాదించుకుంది. ఇక హీరోలు అయితే దేవిశ్రీప్రసాద్ తో తమ సినిమాలకు సంగీతం చేయించుకునేందుకు దర్శకనిర్మాతలు ఎగబడతారు.

తాజాగా బాలీవుడ్ మేకర్స్ సైతం దేవిశ్రీ కోసం ఆయన ఇంటి ముందు క్యూకడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ఎంత పాపులారిటీ వచ్చేసిందో. ఇటీవల రణ్ వీర్ నటిస్తున్న మరో చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ కూడా వచ్చేసింది. ఇంకేముందీ ఆ సినిమాలోని రెండు పాటలు దేవీనే చేస్తున్నాడు.

ఇక 2004లో వచ్చిన వర్షం, 2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, 2006లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రాలకు సంగీతం అందించి ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు వరుసగా అందుకున్నారు దేవిశ్రీప్రసాద్. ఇక 2008లో వచ్చిన జల్సా చిత్రానికి సంతోషం పురస్కారం, 2010లో వచ్చిన ఆర్య చిత్రానికి సినీ-మా అవార్డ్, 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ కు మా సంగీత పురస్కారం, 2013లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: