రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట, రెండు టీజర్లు విడుదల కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా చేసిన రాజమౌళి ఈ సినిమాను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారని అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లో సినిమా చూసి వద్దామా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మామూలుగా దర్శకులు,. రచయితలు ఒక సినిమా అనుకోగానే నటీనటులను కూడా ముందే ఊహించుకుంటారు. ఆ కథ రాసేటప్పుడు ఆ నటీనటులను దృష్టిలో పెట్టుకుని వారి ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలను రాస్తూ ఉంటారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా కథను రాసేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇద్దరు హీరోలతో ఒక పెద్ద చిత్రం చేయాలని రాజమౌళి చెప్పినప్పుడు చాలా కాంబో లు మైండ్ లోకి వచ్చాయి.  రజినీకాంత్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎన్టీఆర్, కార్తి సూర్య , కార్తీ ఆల్లు అర్జున్ ఇలా రకరకాల విషయాల గురించి ఆలోచించాను అన్నాడు.

 చివరికి తారక్ రామ్ చరణ్ లను ఫిక్స్ అయ్యి ఈ సినిమా ను డెవలప్ చేశాం. కథ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓసారి రాజమౌళి ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. ఇద్దరు గొప్ప యోధులు స్వతంత్ర పోరాటం చేయడానికి కంటే ముందు ఎవరికీ కనిపించకుండా కొంత కాలం ఎక్కడికో వెళ్లారు. ఆ టైం లో వారు ఏం చేశారో కూడా ఎవరికీ తెలీదు. కానీ అక్కడినుంచి వచ్చాకే స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ వేరు వేరు కాలాలకు చెందిన వీరు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అక్కడ ఏం జరిగింది. స్వాతంత్ర పోరాటానికి ఎలా స్ఫూర్తి పొందారు అనేదాన్ని ఈ చిత్రం లో వివరించాము అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR