టాలీవుడ్ సినిమా పరిశ్రమకి మెగా మేనల్లుళ్లు గా పరిచమయ్యారు సాయి ధరంతేజ్ మరియు వైష్ణవ్ తేజ్. రేయ్ సినిమాతో సాయి ధరంతేజ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని ఇప్పుడు మినిమం రేంజ్ హీరోగా ఎదిగాడు. మరోవైపు వైష్ణవ్ ఇటీవలే ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై తొలి సినిమాతోనే భారీ హిట్ సాధించి క్రేజీ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ఆయన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా కూడా తెరకెక్కించాడు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్న కు పోటీగా తమ్ముడు తన సినిమాను విడుదల చేస్తున్నాడు అనే ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. వరుస సినిమాల విజయాలతో దూసుకుపోతున్న సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన విడుదల అక్టోబర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైష్ణవ తేజ్ రెండో సినిమా కూడా అదే నెలలో తీసుకు రావాలని చిత్రబృందం భావిస్తు ఉండగా ఈ ఇద్దరు అన్నదమ్ములకు బాక్సాఫీస్ వద్ద వార్ తప్పదని భావిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ మెగా వార్ లో ఈ ఇద్దరు అన్నదమ్ముల లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. వైష్ణవ్ తేజ్ ఇటీవలే తన మూడో సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి ధరమ్ తేజ్ కూడా పెద్ద దర్శకులతో సినిమాలను సెట్ చేసుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి