ఈవారం విడుదలైన చిన్న సినిమాలు అన్నీ అంచనాలు అందుకోలేకపోవడంతో ఈవారం కూడ శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ హవా కొనసాగుతోంది. దీనితో ఇండస్ట్రీ వర్గాల ఆశక్తి అంతా వచ్చే వారం విడుదల కాబోతున్న ‘సిటీమార్’ మూవీ పై పడింది. ప్రస్తుతం హీరో గోపీచంద్  దర్శకుడు సంపత్ నంది ల కెరియర్ అంతంతమాత్రంగానే ఉంది.


దీనితో వీరిద్దరికీ ఒక మంచి హిట్ కావాలి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సిటీమార్’ తమకు ఒక బ్రేక్ ఇస్తుందని ప్రస్తుతం వీరిద్దరూ నమ్ముతున్నారు. వాస్తవానికి ఈమూవీకి మంచి ఓటీటీ ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని పక్కకు పెట్టి గోపీచంద్ ధియేటర్లను నమ్ముకున్నాడు. ధియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన తరువాత సరైన మాస్ మూవీ రాలేదు. దీనితో బిసి సెంటర్ల ప్రేక్షకుల సపోర్ట్ తో తాను గట్టెక్కుతాను అని గోపీచంద్ కలలు కంటున్నాడు.


ఈమూవీని ప్రమోట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. ఈ మూవీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టే ముందు తాను ఏకంగా 700 మంది అమ్మాయిలకు ఆడిషన్ నిర్వహించానని ఈమూవీలో కబడీ గేమ్ ప్లేయర్స్ పాత్రను పోషిస్తున్న 24 మంది అమ్మాయిలను ఎంపికచేసి వారికి కొంత వరకు వారికి ట్రైనింగ్ కూడ ఇప్పించానని చెపుతూ ఈమూవీలో నలుగురు కబాడీ నేషనల్ ప్లేయర్స్ కూడ నటించడంతో ఈమూవీ చూస్తున్న ప్రేక్షకులకు ఒరిజనల్ గేమ్ చూస్తున్న ఫీల్ కలుగుతుందని కామెంట్ చేసాడు.


అంతేకాదు ఈమూవీలో కబాడీ కోచ్ లుగా నటిస్తున్న గోపీచంద్ తమన్నాలకు కూడ కబడీ గేమ్ విషయంలో ప్రాధమీక అవగాహన వచ్చే లా కొద్దిపాటి కోచింగ్ కూడ ఇచ్చాను అని అంటున్నాడు. ఈమధ్య కాలంలో ప్రేక్షకులు స్పోర్ట్స్ డ్రామా మూవీలను బాగా చూస్తున్నారు. ఈ ట్రెండ్ ‘సిటీమార్’ విషయంలో కూడ రిపీట్ అయితే హిట్ గురించి పరితపించి పోతున్న గోపీచంద్ కోరిక తీరే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: