కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల తర్వాత ఈ సినిమాను విడుదల చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ‘నో టైం టు డై’ని విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఈ సారి కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా.. ట్రైలర్ సైతం లాంచ్ చేశారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. అయినా సరే.. మరోసారి బాండ్ మూవీని వాయిదా వేయాలని మేకర్స్ భావించడం లేదు.
‘నో టైం టు డై’ ట్రైలర్ చూస్తే యాక్షన్ ప్రియులకు, బాండ్ సినిమా లవర్స్‌కు కనువిందు ఖాయమనిపిస్తోంది. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో ట్రైలర్ వారెవా అనిపించింది. కథ పెద్దగా రివీల్ కాలేదు కానీ.. బాండ్ గారి కొత్త మిషన్ చాలా ఎగ్జైటింగ్‌గానే ఉండబోతోందని అర్థమవుతోంది.‘టెనెట్’ సహా గత ఏడాది వ్యవధిలో వచ్చిన భారీ హాలీవుడ్ చిత్రాలు చాలా వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. మరి ఈ బాండ్ మూవీ ఇలాంటి బ్యాడ్ టైమ్ లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్స్ ను రాబడుతుందో చూడాలి. డేనియల్ క్రెయిగ్‌కు బాండ్ పాత్రలో ‘నో టైం టు డై’నే చివరి సినిమా. ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి