'మా' ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అయితే తాజాగా బండ్ల గణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని నటి జీవితా రాజశేఖర్‌ అన్నారు. ఈ సంవత్సరం జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ తాజాగా ఓ చానల్ తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి జీవిత రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకు నచ్చలేదు అని , అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ బండ్ల గణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్ స్పందించింది. 'మా' లో సభ్యులుగా ఉన్న ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అని జీవిత రాజశేఖర్ మరోసారి స్పష్టం చేసింది.

 ఎన్నికల్లో నేను గెలిచిన ఒకవేళ ఓడిపోయిన 'మా' అభివృద్ధి కోసం కచ్చితంగా పనిచేసే తీరుతా అని అన్నారు. 'మా' అనేది అందరికీ సంబంధించినది. ఇక్కడ ఎవరి మధ్య పోటీలు లేవు. ప్యానల్ లో ఉన్నవాళ్లు మాత్రమే పోటీ చేయాలి ప్యానెల్ లో లేని వాళ్ళు పోటీ చేయకూడదు అని ఎక్కడా లేదు. సభ్యులుగా ఉన్న ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు. 'మా' కోసం దాని అభివృద్ధి కోసం పాటుపడాలని ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేష్ కూడా అలాగే మా అభివృద్ధి కోసం కృషి చేయాలి అనుకుంటున్నారు. అందుకే ఆయన 'మా' ఎన్నికల బరిలో దిగారు. అంతే తప్ప నాకు వ్యతిరేకంగానో లేదా నెగిటివిటీ తోనో, బండ్ల గణేష్ పోటీ చేస్తున్నారు అని నేను అనుకోవడం లేదు. మేమంతా ఎప్పుడూ ఒకటే, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మా ఎన్నికల్లో నేను గెలిచిన ఓడిన 'మా' అభివృద్ధి కోసం నేను పని చేస్తా అంటూ జీవితారాజశేఖర్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: