నాటితరం ప్రేక్షకులందరికీ నీలాంబరిగా నేటితరం ప్రేక్షకులందరికీ పవర్ఫుల్ శివగామి మారిపోయి తన నటనతో ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ.  తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించి వందల సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.  ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇండస్ట్రీకి గ్లామర్ డాల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 మొదట్లో అన్ లక్కీ హీరోయిన్ అనే అపవాదు కూడా  రమ్యకృష్ణ పై ఉంది. మొదట్లో రమ్యకృష్ణ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. దీంతో రమ్యకృష్ణ ను సినిమాల్లోకి తీసుకోవాలంటే భయపడిపోయారు దర్శకనిర్మాతలు.  కానీ ఆ తర్వాత మాత్రం రమ్యకృష్ణ కెరియర్ ఊహించని రీతిలో హైస్పీడ్ తో దూసుకుపోయింది. ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. వయసు పెరుగుతున్నప్పటికీ వన్నె తరగని అందంతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



 ఇకపోతే నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు సైతం రమ్యకృష్ణ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇకపోతే రమ్యకృష్ణ కెరీర్లో బాహుబలి సినిమా ఒక మైలురాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులందరికీ సినిమాతో శివగామి గా మారిపోయింది రమ్యకృష్ణ. ఈ సినిమాలో రమ్యకృష్ణ అభినయం ఆమె నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే బాహుబలి సినిమా చేసిన తర్వాత  రమ్యకృష్ణ నటనను అందాన్ని చూసి అలనాటి హీరోయిన్ ఖుష్బూ రమ్యకృష్ణ కు కాల్ చేసి చెడామడా తిట్టేసిందట.  నువ్వు ఇంకొకసారి ఇలా నటించటం.. ఇంత అందంగా కనిపించడం..  ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయడం లాంటివి అస్సలు చేయకు అని చెప్పిందట. ఈ విషయాన్ని ఏకంగా కుష్బూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఇద్దరు స్నేహితులు కావడంతో కుష్బూ అలా చెప్పగానే రమ్యకృష్ణ పగలబడి నవ్విందట.

మరింత సమాచారం తెలుసుకోండి: