ఇటు టాలీవుడ్ లో బిగ్ సెలబ్రిటీ జంట నాగ చైతన్య మరియు సమంత లు విడిపోబోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సమంత వీటికి స్పందించి అటు ఇటుగా ఒక  క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ వార్తలకు కొంతమేరకు కళ్లెం పడ్డట్టు అయ్యింది. అయితే అటు బాలీవుడ్ లోనూ మరో సెలబ్రిటీ జంట ఇదే పరిస్థితిని నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంది. ఇంతకీ వారు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా (ప్రముఖ వ్యాపార వేత్త). ఈ మధ్య పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే, ఆయన అలా అరెస్ట్ అయ్యి విషయం కాస్త పెద్దది కావడంతో శిల్పా శెట్టి తన భర్తతో విడిపోవడానికి డిసైడ్ అయిందని విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంది అంటూ బాలీవుడ్ సోషల్ మీడియాల్లో వార్తలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. 

దానికి తోడు శిల్పా శెట్టి సింగల్ మదర్ గా నేను ధైర్యంగా బ్రతకగలను అలాగే అంత ఆర్ధిక స్తోమత నాకు ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆ వార్తలు మరింత చెలరేగాయి. అయితే ఇప్పుడు ఒక్క మాటతో వాటన్నింటికీ చెక్ పెట్టారు శిల్పా శెట్టి. మేమిద్దరం ఎప్పటిలాగానే అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని, ఉంటామని...అదీకాక ఈ మధ్య అనూహ్యంగా ఎదురైన  కొన్ని పరిణామాల వలన మా  బంధం మరింత దృఢంగా మారిందని  చెప్పుకొచ్చారు శిల్పాశెట్టి. అయితే ఇపుడు మళ్ళీ వీరి విడాకుల విషయం తవ్వే ప్రయత్నం చేస్తున్నట్లు అంటున్నారు. పైకైతే శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ విషయం లో ఇంకా కన్ఫ్యూజన్ కొంత మిగిలే ఉందని అంటున్నారు కొందరు. ఇదే కనుక నిజమైతే మరి శిల్పా శెట్టి అప్పట్లో ....సింగల్ మదర్ గా జీవించగలను అంటూ ఎందుకు పోస్ట్ పెట్టారు అంటూ మళ్ళీ విషయాన్ని మొదటికి తెస్తున్నారు.

దీంతో వీరి మధ్య విషయం విడాకుల వరకు వెళ్లింది నిజమే కానీ మళ్ళీ అంతా సర్దుమనగడంతో సమస్య కుదుటపడింది అని కొందరు అంటున్నారు. మరికొందరు అప్పుడు శిల్పా శెట్టి అలా అనడం వెనక ఓ కారణం ఉంది. భర్త అరెస్ట్ కావడంతో వారి ఆర్థిక పరిస్థితి పడిపోయిందని మాటలు వినిపించడంతో శిల్పా అలా అన్నారే తప్ప భర్తతో విడిపోవాలనే ఉద్దేశంతో కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: