తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి దర్శకుడు కూడా భిన్నమైన రీతిలో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.  ఇక అందరు దర్శకులతో పోల్చి చూస్తే కాస్త భిన్నమైన సినిమాను తెరకెక్కిస్తు..  ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడూ దర్శకుడు క్రిష్.  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఏదైనా సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉండబోతుందని తెలుగు ప్రేక్షకులు అందరూ భావిస్తూ ఉంటారు.  అంతలా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.  సినిమాపై పాషన్ తో అమెరికాలో మంచి ఉద్యోగాన్ని సైతం వదులుకొని వచ్చి దర్శకుడిగా మారి ప్రస్తుతం సత్తా చాటుతున్నారు క్రిష్ జాగర్లమూడి.



 అయితే ఇప్పటికే ఎన్నో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలని తన ఖాతాలో వేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి..  ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక.. సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు క్రిష్. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల మెగా యువహీరో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కొండపొలం అనే సినిమాను తెరకెక్కించారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఉప్పెన అనే సినిమాతో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ మరోసారి రెండో సినిమాతో విభిన్నమైన స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.



 అయితే కొండపొలం అనే సినిమా గురించి ఇటీవల దర్శకుడు క్రిష్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడవులు జంతువులు నేపథ్యంలో సినిమా తీయాలని ఎప్పటినుంచో ఉండేదని చెప్పుకొచ్చారు దర్శకుడు. అయితే వెంకటేష్ తో అతడు అడవిని జయించాడు అనే ఒక సినిమాని జంగిల్ బుక్ తరహాలో తీద్దామనుకున్నాడట క్రిష్. రైట్స్ లభించకపోవడంతో వెంకటేష్ తో సినిమా చేయలేకపోయాడట. కానీ ఇన్నాళ్ళకి ఆ కోరిక వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొండపొలం సినిమాతో తీరిందని దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చాడూ. కాగా ఈ సినిమా ఈనెల 8వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: