సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ చంటిగాడు లోకల్..  డైలాగ్ దాదాపు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది   అయితే ఈ డైలాగ్ కి అచ్చంగా సరిపోయే మనిషి యాంకర్ సుమ.  సుమ యాంకరింగ్ మొదలుపెట్టి ఎన్నో ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో కార్యక్రమాలు చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఇంకెన్నో కార్యక్రమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. యాంకరింగ్ ఫీల్డ్ లో సుమ షోలు పెరిగిపోవడమే కాదు ఆమె వయసు కూడా పెరిగిపోతుంది. ఎంతో మంది కొత్త యాంకర్లు కూడా అప్పుడప్పుడు తెర మీదకు వస్తున్నారు. కానీ సుమా మాత్రం తెలుగు బుల్లి తెర పై ఇప్పటికి కూడా టాప్ యాంకర్ గానే కొనసాగుతోంది.



 ఎంతో మంది కొత్త యాంకర్లు  వచ్చి పోయినప్పటికీ తాను మాత్రం లోకల్ అన్నట్లుగా ప్రస్తుతం ఎన్నో కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇక ఇప్పటికికూడా సుమ యాంకరింగ్ ని బీట్ చేసే యాంకర్ టాలీవుడ్ లో లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ యాంకర్గా కొనసాగుతూ దూసుకుపోతుంది సుమ. ఏ కార్యక్రమం నిర్వహించిన స్పాంటినిటీతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఇకపోతే ఇటీవల సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమం సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది.



 ఈ ప్రోమో ఎంతో మందిని ఆకర్షిస్తుంది. అయితే యాంకర్గా సుమ ఇప్పటివరకూ ఎంతోమందిని ఇమిటేట్ చేయడం చూసాం. ఇక ఇటీవల విడుదలైన ప్రోమోలో ఏకంగా చేతిలో గిటార్ పట్టుకుని పాట పాడింది. అయితే నిజంగా సుమ ఇలా పాట పాడలేదు. ఈ షో కి గెస్ట్ గా వచ్చిన హీరో వెంకట్ గిటార్ పట్టుకుని తన సినిమాలోని ఒక పాట పాడుతున్నట్లు గా యాక్టింగ్ చేసాడు. కాసేపటి వరకు ఆలోచించిన సుమ వెంటనే ఇంకో గిటార్ తెచ్చుకొని లేడీ వాయిస్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేసింది. ఇక సుమ ఇలా చేయడంతో ఇది చూసిన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: